Sun. Dec 15th, 2024

Hyderabad rape case: అత్యాచారాల‌పై కేసీఆర్‌, కేటీఆర్ ఎందుకు మాట్లాడ‌టం లేదు.. ?

BJP , MP Arvind, KCR, KTR, Telangana, rape cases, Arvind Dharmapuri, Hyderabad, బీజేపీ, అరవింద్, కాసర్, కట్టర్, తెలంగాణ, రేప్ కేసులు, అరవింద్ ధర్మపురి, హైదరాబాద్,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Telangana: హైద‌రాబాద్ లో వారం రోజుల్లోనే మైనర్‌లపై ఐదు అత్యాచార కేసులు నమోదైన క్ర‌మంలో మహిళలపై జరుగుతున్న నేరాలు, అఘాయిత్యాల గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్ లు ఎందుకు మాట్లాడ‌టం లేద‌ని బీజేపీ పార్ల‌మెంట్ స‌భ్యులు అరవింద్ ధర్మపురి ప్రశ్నించారు. వారు అత్యాచారాలను ప్రోత్సహిస్తున్నారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మే 28న 17 ఏళ్ల మైనర్‌తో సంబంధం ఉన్న మొదటి కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

బీజేపీ ఎంపీ అర‌వింద్ ANIతో మాట్లాడుతూ.. “గత వారంలో నాలుగు మైనర్ బాలికలపై అత్యాచారం కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ 22న 16 ఏళ్ల బాలికపై అత్యాచారం, మే 28న 17 ఏళ్ల బాలికపై అత్యాచారం, మే 30న 15 ఏళ్ల బాలికపై అత్యాచారం, మే 31న 16 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. అదే రోజు 11 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది, నిన్న రాత్రి నిజామాబాద్ జిల్లాలో మరో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. “ఇక్కడ ఏమి జరుగుతుందో తెలియ‌డం లేద‌ని అన్నారు. లైంగిక‌దాడి కేసులో ఉన్న‌ప్ప‌టికీ ఏఐఎంఐఎం నాయకుడి కొడుకు గురించి మాట్లాడటం లేదు. ఈ విషయంపై కేసీఆర్‌, కేటీఆర్ స్పందించాలి. చిన్న విషయాలకు కేటీఆర్ ట్విట్టర్‌లో స్పందిస్తారు కానీ రాష్ట్రంలో గత 10, 15 రోజుల్లో జరిగిన ఆరు అత్యాచారాల కేసులపై మాత్రం పెదవి విప్పడం లేదు. మీరు అత్యాచారాలను ప్రోత్సహిస్తున్నారా?” అని ఎంపీ అర‌వింద్ ధర్మపురి అన్నారు.

Share this content:

Related Post