Loading Now
Karnataka , Karnataka Old Mosque Row, Mosque Row, Gyanvapi, VHP ,Mangalore,

Ayodhya mosques: అయోధ్యలో మ‌త అల్లర్లకు కుట్ర… ఏడుగురు అరెస్ట్

ద‌ర్వాజ‌-ల‌క్నో
Ayodhya: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని అయోధ్య‌లో మ‌త అల్ల‌ర్లు సృష్టించ‌డానికి ప‌లువురు వ్య‌క్తులు కుట్ర‌ప‌న్నారు. దీనిలో భాగంగా అయోధ్య‌లోని కొన్ని మసీదుల ముందు పంది మాంసం, ముస్లింలను దుర్భాషలాడుతూ లేఖలు, ఇస్లామిక్ గ్రంథపు పేజీలను చింపి.. ప‌డేశారు. అయోధ్య‌లో అల్ల‌ర్లు, మ‌త ఘ‌ర్ష‌లు సృష్టించే విధంగా ఇలాంటి ఘ‌ట‌న‌ల‌కు పాల్ప‌డిన నిందితుల‌ను పోలీసులు గుర్తించారు. ఇప్ప‌టివ‌ర‌కు ఏడుగురిని అరెస్టు చేయ‌గా, మ‌రికొంత మంది నిందితులు ప‌రారీలో ఉన్నార‌ని పోలీసులు తెలిపారు. పోలీసులు అదుపులోకి తీసుకున్న వారు ‘హిందూ యోధ సంఘటన’ (Hindu Yodha Sangathan) అనే సంస్థకు చెందినవార‌ని తెలిపారు. ఇదివ‌రకే ఈ హిందూ యోధ సంఘటన నాయకుడిపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదయ్యాయ‌ని పోలీసులు తెలిపారు.

అయోధ్య‌లోని తాత్షా జామా మసీదు, ఘోసియానా మసీదు, కాశ్మీరీ మొహల్లాలోని మసీదు, గులాబ్ షా బాబాగా పిలిచే మజార్‌లో మ‌త అల్ల‌ర్లు సృష్టించ‌డానికి జ‌రిగిన ఈ కుట్ర‌కు సంబంధించి నాలుగు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. హిందూ యోధ సంఘటన్ స‌భ్యులు చేసిన ఈ ప‌నులు అయోధ్యలో మత హింసను సృష్టించి అల్లర్లను ప్రేరేపించే కుట్ర‌లో భాగ‌మ‌ని పోలీసులు తెలిపారు. ఈ కుట్రలో మొత్తం పదకొండు మంది పాల్గొన్నారని, వీరంద‌రూ దీనికి ముందు వారు అల్ల‌ర్లు సృష్టించ‌డానికి పందిమాంసం, ఇస్లాం మ‌త గ్రాంథాలు, రాత సామ‌గ్రిని కొనుగోలు చేసిన‌ట్టు పోలీసులు గుర్తించారు. ఢిల్లీలోని జహంగీర్‌పూరీ ఘటనపై నిందితులు ఆగ్రహంతో ఉన్నారని, ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారని విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. అరెస్టు చేసిన వారిని ఆ సంస్థ నాయకుడు మహేష్ మిశ్రాగా, ప్రత్యూష్ కుమార్, నితిన్ కుమార్, దీపక్ గౌడ్, బ్రజేష్ పాండే, శత్రుఘ్న, విమల్ పాండేగా గుర్తించారు.

Share this content:

You May Have Missed