Breaking
Tue. Nov 18th, 2025

అమిత్ షా చెప్పులు మోసిన బండి సంజ‌య్.. !

darvaaja,Telugu news, Telugu News updates, తాజా వార్త‌లు, తెలుగు న్యూస్‌, ద‌ర్వాజ‌, అమిత్ షా,బండి సంజ‌య్, బీజేపీ ,సోష‌ల్ మీడియా, వీడియో , కేటీఆర్, తెలంగాణ‌, Amit Shah, Bandi Sanjay, BJP, Social Media, Video, KTR, Telangana,

ద‌ర్వాజ‌-హైదరాబాద్

సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ఆదివారం పూజలు చేసిన అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చెప్పుల‌ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ తీసుకుంటున్న వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అలాగే, అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలకు దారితీసింది. బీజేపీ నేతలు ఇంత దారుణ బానిసత్వంలో బతుకుతున్నారంటూ ఇతర పార్టీల నేతలు, నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

బండి సంజయ్ తీరుపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) గుజరాత్, న్యూఢిల్లీ నేతల ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని విమర్శించారు. ఇలాంటి నాయకుల చర్యలను తెలంగాణా నిశితంగా గమనిస్తోందని, అలాంటి నాయకుల ప్రయత్నాలను తెలంగాణ సమాజం తిప్పికొడుతుందని అన్నారు.

“ఢిల్లీ “చెప్పులు” మోసే గుజరాతీ గులాములను- ఢిల్లీ నాయకులకు చుక్కలు చూపిస్తున్న నాయకున్ని – తెలంగాణ రాష్ట్రం గమనిస్తున్నది. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కించపరిచే ప్రయత్నాన్ని తిప్పి గొట్టి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలపడానికి తెలంగాణ సబ్బండ వర్ణం సిద్దంగా ఉన్నది. జై తెలంగాణ! ” అంటూ ట్వీట్ చేశారు.

వీడియోలో బండి సంజయ్ ఆలయం నుండి బయటకు వచ్చిన తర్వాత అమిత్ షా చెప్పుల‌ను తీసుకువ‌చ్చి.. ఆయ‌న వేసుకోవ‌డానికి వీలుగా వాటిని నేలపై ఉంచడం కనిపించింది. అమిత్ షా వెనుక ఉన్న సంజయ్, హడావుడిగా పాదరక్షలు సేకరించి నేలపై ఉంచాడు. ఆదివారం మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో దిగిన తర్వాత షా ఆలయాన్ని సందర్శించారు. మునుగోడులో జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించేందుకు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనేందుకు షా నగరానికి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.

Related Post