దర్వాజ-న్యూఢిల్లీ
Congress Bharat Jodo Yatra: కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర 20వ రోజుకు చేరుకున్న క్రమంలో.. బీజేపీ రెండు భారత దేశాలను సృష్టించిందని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఒకటి ధనవంతులు, రెండు పేదలు అని పేర్కొన్నారు. అలాగే, బడా పారిశ్రామిక వేత్తల వేల కోట్ల రుణాలు మాఫీ చేస్తారు.. కానీ చిన్న రైతులు, చిరు వ్యాపారులను మాత్రం జైల్లో పెడుతారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘‘ఈరోజు బడా పారిశ్రామికవేత్తల నుంచి వేలకోట్ల రుణాలు మాఫీ చేస్తున్నారు.. కానీ, రైతు, చిన్న వ్యాపారి చిన్న రుణం కూడా తీర్చలేకపోతే ‘డిఫాల్టర్’ అంటూ జైల్లో పెడుతున్నారు. భారత్ జోడో యాత్ర ప్రతి అన్యాయానికి వ్యతిరేకం. రాజు, దో హిందుస్థాన్ వెర్షన్‌ను దేశం అంగీకరించదు” అని రాహుల్ గాంధీ ట్వీట్ లో పేర్కొన్నారు. 19వ రోజు సామూహిక సంప్రదింపు కార్యక్రమం ముగిసిన తరువాత చేసిన ప్రసంగంలో, గాంధీ యాత్రను విభజించే ప్రయత్నాలను కూడా ఆరోపించారు. ఈ ర్యాలీలో ప్రజలు విభజించబడాలని బీజేపీ ఆరెస్సెస్ లు కోరుకుంటున్నాయని ఆరోపించారు.
आज बड़े उद्योगपतियों का अरबों का क़र्ज़ माफ़ किया जा रहा है।
— Rahul Gandhi (@RahulGandhi) September 26, 2022
लेकिन, अगर एक किसान या छोटा व्यापारी, छोटा सा भी क़र्ज़ न लौटा पाए तो उसे 'Defaulter' बता कर जेल में डाल देते हैं।
भारत जोड़ो यात्रा, हर अन्याय के खिलाफ़ है। राजा के ये ’दो हिंदुस्तान' भारत स्वीकार नहीं करेगा।