Breaking
Tue. Nov 18th, 2025

Asaduddin Owaisi: బీజేపీ-ఆరెస్సెస్ పై అసదుద్దీన్ ఒవైసీ ఘాటు వ్యాఖ్య‌లు !

Asaduddin Owaisi

దర్వాజ-ముంబయి

Asaduddin Owaisi: ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ), రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) పై మ‌రోసారి తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. మొఘలుల తర్వాతే బీజేపీ-బీజేపీ-ఆరెస్సెస్ అంటూ కాషాయం ద‌ళంపై ఎంఐఎం అధినేత‌, హైద‌రాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. భారతదేశం ఎవరికైనా చెందితే అది ద్రావిడులు, ఆదివాసీలకు అని ఆయ‌న అన్నారు. మ‌హారాష్ట్రలోని భివాండీలో జరిగిన ర్యాలీలో అసదుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ, “భారతదేశం నాది కాదు, థాక్రేది కాద.. మోడీ-షాలది కాదు. భారతదేశం ఎవరికైనా చెందితే, అది ద్రావిడులు మరియు ఆదివాసీలు.. మొఘలుల తర్వాత మాత్రమే BJP-RSSలు. ఆఫ్రికా, ఇరాన్, మధ్య ఆసియా, తూర్పు ఆసియా నుండి ప్రజలు వలస వచ్చిన తర్వాత భారతదేశం ఏర్పడింది” అని ఒవైసీ అన్నారు.

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్‌పై కూడా ఒవైసీ విమ‌ర్శ‌లు గుప్పించారు. శివసేన ఎంపి సంజయ్ రౌత్‌కు చేసినట్లుగా నవాబ్ మాలిక్ అరెస్టుపై ప్రధాని నరేంద్ర మోడీని శ‌ర‌ద్ ప‌వార్ ఎందుకు కలవలేదని ప్రశ్నించారు. ర్యాలీలో ఎన్‌సీపీ, శివసేన, బీజేపీల‌పై విమ‌ర్శ‌ల దాడిని ఆయ‌న కొసాగించారు. “నవాబ్ మాలిక్ సంజయ్ రౌత్ కంటే తక్కువా? నవాబ్ మాలిక్ కోసం మీరు ఎందుకు మాట్లాడలేదని నేను శరద్ పవార్‌ని అడగాలనుకుంటున్నాను. అతను ముస్లిం అయినందుకా? సంజయ్ మరియు నవాబ్ సమానం కాదా?’’ అని ఒవైసీ అన్నారు.

Related Post