దర్వాజ-రంగారెడ్డి
brahmotsavam : రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలంలోని దేవుని పడకల్ గ్రామంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మో త్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి , భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి తిరుకళ్యాణ వేడుకలు సోమవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. శ్రీవారి కళ్యాణం చూడటానికి భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కళ్యాణం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.
వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలకు జాతీయ బీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి, ఆలయ ధర్మకర్త లట్టుపల్లి రాజ్ కుమార్ , పీఏసీఎస్ చైర్మెన్ గట్ల కేశవరెడ్డి , కార్యనిర్వాహణ అధికారి బి.మోహన్ రావు , దేవని పడకల్ గ్రామ సర్పంచ్ కాడెమోని శ్రీశైలం , ఉపసర్పంచ్ రాజమోని తిరుపతి సహా పలు రాజకీయ పార్టీల నాయకులు, భక్తులు పాలుపంచుకున్నారు.



