దర్వాజ-న్యూఢిల్లీ
Budget 2024-25 Highlights: లోక్‌సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2014 నుంచి ప్రధాని నరేంద్ర మోడీ సర్కారుకు ఇది 13వ బడ్జెట్ కాగా.. ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఏడోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 2047కల్లా వికసిత్ భారత్ అనే లక్ష్యానికి అనుగుణంగా బడ్జెట్ ను తీసుకువచ్చినట్టు తెలిపారు.
కేంద్ర బడ్జెట్ 2024-25 కేటాయింపులు ఇలా..
- కేంద్ర బడ్జెట్‌ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు..
- రూ.32.07 లక్షల కోట్లతో కేంద్ర బడ్జెట్
- మౌలిక సదుపాయాల కల్పనకు బడ్జెట్‌లో పెద్దపీట – రూ.11.11 లక్షల కోట్లు కేటాయించిన కేంద్రం
- మహిళాభివృద్ధికి రూ.3 లక్షల కోట్లు
- గ్రామీణాభివృద్ధికి రూ.2.66 లక్షల కోట్లు
- అర్బన్ హౌసింగ్ కోసం రూ.2.2 లక్షల కోట్లు
- వ్యవసాయం, అనుబంధ రంగాలకు రూ.1.52 లక్షల కోట్లు
- స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి
- మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీతగ్గింపు
- ముద్రలోన్ పరిమితి రూ.20 లక్షలకు పెంపు
- యువత కోసం ఐదు పథకాలతో పీఎం ప్యాకేజ్
- విద్య, నైపుణ్యాభివృద్ధికి రూ.లక్షా 48 వేల కోట్లు
- కోటి ఇళ్లకు సోలార్ ప్యానెళ్ల ద్వారా ఉచిత విద్యుత్
- ఐదు వరద బాధిత రాష్ట్రాలకు ప్రత్యేక నిధులు
- MSMEలకు క్రెడిట్ గ్యారంటీ పథకాలు
- త్వరలో రూ.100 కోట్ల రుణాలు ఇచ్చే కొత్త పథకం
- తనఖాలు, గ్యారంటీలు లేకుండా.. యంత్రపరికరాల కొనుగోలుకు టెర్మ్ రుణాలు
- 100 నగరాల్లో ప్లగ్ &ప్లే తరహా పారిశ్రామిక పార్కులు
- దేశంలో చిన్న ఎయిర్‌పోర్టుల నిర్మాణానికి ప్రోత్సాహం
- వారణాసి తరహాలో గయాలో టెంపుల్ కారిడార్
బడ్జెట్ లెక్కలు ఇవే..
- కేంద్ర బడ్జెట్ – రూ.48.21 లక్షల కోట్లు
- కేంద్ర బడ్జెట్ పరిమాణం రూ.48.21 లక్షల కోట్లు
- మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు
- పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు
- ద్రవ్యలోటు 4.9 శాతంగా ఉండవచ్చని అంచనా
- అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు అంచనా
బడ్జెట్ థీమ్.. తొమ్మిది అంశాలు ఇవే
- వ్యవసాయంలో ఉత్పాదకత పెంచడం
- ఉద్యోగం, నైపుణ్యాలు పెంచడం
- మానవ వనరుల అభివృద్ధి-సామజిక న్యాయం
- తయారీరంగం, సేవలు
- పట్టణాల అభివృద్ధి
- ఇంధన భద్రత
- మౌలిక వసతుల అభివృద్ధి
- ఆవిష్కరణలు, పరిశోధన-అభివృద్ధి
- కొత్తతరం సంస్కరణలు
Read More
తెలంగాణ బడ్జెట్ 2024-25 : రూ. 75,577 కోట్లకు చేరిన రాష్ట్ర అప్పు
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయాన్ని నిరసిస్తూ అసెంబ్లీ తీర్మానం
కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం : సీఎం రేవంత్ రెడ్డి
Budget 2024-25 : ధరలు తగ్గేవి ఏమిటి? పెరిగేవి ఏమిటి?
పద్మశ్రీ గ్రహీతలకు పింఛన్.. తెలంగాణ సర్కారు ఉత్తర్వులు