Loading Now
Budget2024, Nirmala Sitharaman

Budget 2024-25 : ధ‌ర‌లు త‌గ్గేవి ఏమిటి? పెరిగేవి ఏమిటి?

దర్వాజ-న్యూఢిల్లీ

Union Budget 2024 : కేంద్ర‌ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర ప్రభుత్వ పూర్తి బడ్జెట్‌ను పార్ల‌మెంట్ లో ప్ర‌వేశ‌పెట్టారు. ఇదులో ప‌లు పన్ను మినహాయింపులు ప్రకటించారు. అలాగే, కొన్ని వస్తువులపై పన్నులు కూడా పెంచారు. బడ్జెట్ తర్వాత ఏ వస్తువుల ధ‌ర‌లు త‌గ్గాయి? ఏ వ‌స్తువుల ధ‌ర‌ల పెరిగాయి. అనే వివ‌రాలు ఇలా ఉన్నాయి.

కొత్త కేంద్ర బ‌డ్జెట్ 2025 త‌ర్వాత దేశంలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే పలు ఔషధాల ధరలు తగ్గుతున్నాయి. మూడు ముఖ్యమైన ఔషధాలపై ప్రభుత్వం పన్నులను ఎత్తివేసింది. ఆ మూడు మందులను పూర్తిగా డ్యూటీ ఫ్రీ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల తెలిపారు. దీంతో ఆ క్యాన్సర్ మందుల ధర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, మొబైల్ ఛార్జర్లు, ఇతర మొబైల్ పరికరాల ధరలు కూడా త‌గ్గ‌నున్నాయి. ఈ వస్తువులపై సాధారణ సుంకం దాదాపు 15 శాతం తగ్గింది. ఫలితంగా మొబైల్‌లు, సంబంధిత వస్తువులు గతంలో కంటే తక్కువ ధరకు లభిస్తాయి.

బంగారం, వెండి ధరలు కూడా తగ్గనున్నాయి. బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని ఆరు శాతం తగ్గిస్తున్నట్లు నిర్మల మంగళవారం తెలిపారు. చాలా మంది ఆర్ధిక‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సుంకం త‌గ్గింపుతో బంగారం, వెండి ధరలు త‌గ్గ‌డంతో పాటు ఈ లోహాలకు డిమాండ్ పెరుగుతుంది. ఫలితంగా సామాన్యులు బంగారం లేదా వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేయడం ప్రారంభిస్తారు. ఫలితంగా విలువైన లోహాల స్మగ్లింగ్ కూడా త‌గ్గుతుంద‌ని భావిస్తున్నారు.

కేంద్ర బ‌డ్జెట్ 2024 త‌ర్వాత ధ‌ర‌లు త‌గ్గేవి:

  • ప్లాటినంపై 6.4 శాతం సుంకాన్ని తగ్గిస్తున్నారు. ఫలితంగా ప్లాటినం ధర కూడా తగ్గే అవకాశం ఉంది.
  • లెదర్ వస్తువులపై సుంకాన్ని తగ్గించారు. వాటితో త‌యారుచేసే వ‌స్తువుల ధ‌ర‌లు కూడా తగ్గే అవకాశం ఉంది.
  • మరో రెండు లోహాల ధరలు కూడా త‌గ్గ‌నున్నాయి. నికెల్, రాగిపై సాధారణ పన్నును ప్రభుత్వం ఎత్తివేసింది. దీంతో ఈ రెండు లోహాల ధరలు భారీగా తగ్గుతాయని అంచనా. ఇది కాకుండా 25 ముఖ్యమైన లోహాలపై పన్నులను పూర్తిగా ఎత్తివేశారు.
  • సౌర ఫలకాలను తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాలపై కూడా ప్రభుత్వం పన్నును తొలగించింది.
  • సీఫుడ్, ఇతర మత్స్య ఉత్పత్తులపై పన్ను 5 శాతం త‌గ్గించారు.
  • బంగారం, వెండిపై విధించే ప‌న్నుల‌ను త‌గ్గించారు. 15 శాతం నుంచి 6 శాతంకు ప‌న్ను త‌గ్గించారు.

బడ్జెట్‌లో ధ‌ర‌లు పెరిగేవి..

  • ఇప్పటి వరకు టెలికమ్యూనికేషన్ పరికరాలపై 10 శాతం పన్ను విధించేవారు. దీనిని 15 శాతంకు పెంచారు.
  • వివిధ రకాల ప్లాస్టిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. ప్లాస్టిక్ వస్తువులపై సుంకం పెంచారు.
  • దీంతో పాటు అమ్మోనియం నైట్రేట్‌పై కేంద్రం 7.5 నుంచి 10 శాతానికి పన్ను పెంచింది.
  • సిగరెట్ల ధరలు కూడా పెరగనున్నాయి.
  • ప్లాటినం వస్తువుల ధరలు కూడా పెరగనున్నాయి.
  • కాంపౌండ్ రబ్బరు ధరలు కూడా పెరగనున్నాయి.
  • కాపర్ స్క్రాప్ ధరలు అధికం కానున్నాయి.

Share this content:

You May Have Missed