Breaking
Tue. Nov 18th, 2025

Chhattisgarh: హైనాల అటాక్‌.. 13 మేక‌లు మృతి

Telugu News, ద‌ర్వాజ‌, darvaaja, Telugu News updates, తెలుగు న్యూస్‌, తాజా వార్త‌లు, Durg, goats, hyenas, Chhattisgarh ,Durg district, Raunda village, Dhamdha area, దుర్గ్, మేకలు, హైనాలు, ఛత్తీస్‌గఢ్ ,దుర్గ్ జిల్లా, రౌండా గ్రామం, ధమ్ధా ప్రాంతం,

దర్వాజ-హైదరాబాద్

Chhattisgarh: ఛత్తీస్ గఢ్ లోని దుర్గ్ జిల్లాలోని ఓ గ్రామంలో హైనాల దాడిలో 13 మేకలు మృతి చెందినట్లు అధికారులు బుధవారం తెలిపారు. ఈ ప్రాంతంలో ఇలాంటి దాడి జరగడం ఇదే తొలిసారని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ శశికుమార్ తెలిపారు. మంగళవారం రాత్రి ధమ్ధా ప్రాంతంలోని రౌండా గ్రామంలోని స్వామి నిషాద్ కూరగాయల తోటలో కట్టిన మేకలపై హైనాల గుంపు దాడి చేసింది.

మేకల అరుపులు విన్న కొందరు స్థానికులు పొలానికి చేరుకుని హైనాలను తరిమికొట్టారని తెలిపారు. ఈ దాడిలో 13 మేక‌లు చనిపోగా, మరో ఎనిమిది తీవ్రంగా గాయపడ్డాయ‌ని తెలిపారు. ఈ ప్రాంతంలో హైనాలు దాడి చేయడం ఇదే తొలిసారని, గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించినట్లు అధికారులు తెలిపారు. మేకల యజమానికి నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిస్తామని చెప్పారు.

Related Post