Loading Now
RK Roja

జగనన్న ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం: మంత్రి ఆర్కే రోజా

ద‌ర్వాజ‌-కృష్ణ‌జిల్లా

AP Tourism minister R.K. Roja: ప్రజలకు మేలు చేసే ఏదైనా స్కీం రావాలంటే, ఐస్ క్రీం లాంటి చల్లని మనసు సైతం ఉండాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక యువజన అభ్యుదయ శాఖ మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో 4 వ విడత వైఎస్సార్ సున్నావడ్డీ పథకం జిల్లా కార్యక్రమం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. గతంలో రుణాలు సకాలంలో చెల్లించని కారణంగా సంఘాల పరపతి దెబ్బతిని అప్పటివరకు “ఏ”, “బి” గ్రేడ్ లో ఉన్న సంఘాలు “సీ, డి” గ్రేడ్లకు దిగజారాయని గుర్తు చేశారు. అయితే, జగనన్న ప్రభుత్వ హయాంలో కృష్ణాజిల్లా వ్యాప్తంగా 35 వేల 752 స్వయం సహాయక సంఘాలు, 3 లక్షల 77 వేల 347 మంది అక్క చెల్లెమ్మలకు రూ. 46.02 కోట్లు, కేవలం అవనిగడ్డ నియోజకవర్గంలో 6,095 స్వయం సహాయక సంఘాలు 65 వేల 391 అక్క చెల్లెమ్మలకు రూ. 7.10 కోట్ల రూపాయలు, ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 1,05, 13, 365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించినట్లు తెలిపారు.

అలాగే, రూ. 1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి తరపున అదే అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో శుక్రవారం డా.బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బటన్ నొక్కి నేరుగా జమ చేస్తున్న ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి అనీ, తమ ప్రభుత్వం మహిళ పక్షపాత ప్రభుత్వమని మంత్రి రోజా అన్నారు. ఇప్పుడు అందిస్తున్న రూ. 1,353.76 కోట్లతో కలిపి “వైఎస్సార్ సున్నావడ్డీ” క్రింద అందించిన మొత్తం సాయం రూ. 4,969.05 కోట్లు అని తెలిపారు. నిత్యం ప్రజల్లో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ కోట్లాదిమంది మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ప్రజలంతా అండగా ఉంటారనే నమ్మకం తనకుందని మంత్రి రోజా విశ్వాసం వ్యక్తం చేశారు.

మన రాష్ట్రంలోని మహిళలు వారి కాళ్ళ మీద వారు నిలబడేలా, తద్వారా వారి జీవనోపాధి మెరుగుపడేలా.. బహుళ జాతి, దిగ్గజ కంపెనీలు, బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకొని వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ కాపు నేస్తం, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ సున్నా వడ్డీ వంటి మహత్తర పథకాలతో సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేసిన జగనన్న ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన పరిపాలన అందిస్తూ భవిష్యత్తులో మరిన్ని సంస్కరణలు చేయడం ఖాయమని మంత్రి రోజా విశ్వాసం వ్యక్తం చేశారు

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు, మాజీ మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, కెడిసిసి బ్యాంక్ చైర్ పర్సన్ తాతినేని పద్మావతి, రైతు విభాగం జోనల్ ఇంఛార్జి కడవకొల్లు నరసింహారావు, అవనిగడ్డ సర్పంచ్ గొర్రుముచ్చు ఉమ, ఎంపీపీ తుంగల సుమతీదేవి, జడ్పిటిసి చింతలపూడి లక్ష్మీనారాయణతో పాటు డిఆర్ఓ ఎం. వెంకటేశ్వర్లు, మచిలీపట్నం ఆర్డిఓ ఐ. కిషోర్, డిఆర్ డి ఏ ప్రాజెక్టు డైరెక్టర్ పిఎస్ఆర్ ప్రసాద్ తో పాటు పలువురు జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Share this content:

You May Have Missed