దర్వాజ-అమరావతి
Happy Children’s Day 2023: ప్రతి సంవత్సరం నవంబర్ 14న బాలల దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి. భారతదేశంలో పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పుట్టినరోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. జవహర్‌లాల్ నెహ్రూ 1889 నవంబర్ 14న ప్రయాగ్‌రాజ్‌లో జన్మించాడు. పిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టం. చిన్నారులు దేవుడి రూపమనీ, ఇంట్లో ఉన్న అందమైన పూలు అని ఎప్పుడూ చెప్పేవారు.
బాలల దినోత్సవం ప్రాముఖ్యత..
భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 14ని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు. దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జయంతిని కూడా ఈ రోజునే జరుపుకుంటారు. పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ పిల్లలను ఎంతగానో ప్రేమించేవారు, పిల్లలు ఆయనను చాచా నెహ్రూ అని పిలిచేవారు. ఇంతకుముందు, భారతదేశంలో నవంబర్ 20 న బాలల దినోత్సవం జరుపుకునేవారు, అయితే 1964లో మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మరణించిన తరువాత, అతని పుట్టినరోజును బాలల దినోత్సవంగా ప్రకటించారు. పిల్లల ఆరోగ్యం, భద్రతను ప్రోత్సహించడం కూడా ఈ రోజు లక్ష్యం.
బాలల దినోత్సవం జరుపుకునే అవసరమేంటి?
బాలల దినోత్సవాన్ని జరుపుకోవడనే అంశం పిల్లలకు సంబంధించినది. పిల్లలకు సరైన విద్య, పోషకాహారం, మంచి బాల్యం, వారి ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించేందుకు అవసరమైన చర్యలు, పనులకు చొరవ తీసుకోవడానికి ఈ రోజు ప్రత్యేక సందర్భం.. అవకాశాలను కల్పిస్తుంది. ఇందుకోసం ప్రతి సంవత్సరం ప్రత్యేకంగా బాలల దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చిల్డ్రన్స్ డే రోజున పిల్లలు తమ ప్రతిభను ప్రదర్శిస్తారు. వారి కోసం వివిధ పోటీలు నిర్వహిస్తారు, పిల్లలకు నృత్యం, పాటల పాడటం, ప్రసంగాలు ఇవ్వడానికి అవకాశాలు లభిస్తాయి. కథలు రాయడం, వ్యాసరచన, కవితలు రాయడంతోపాటు పిల్లలకు కవితలు చదివే అవకాశం వివిధ పోటీలతో అవకాశం కల్పిస్తారు. ప్రత్యేక వంటకాలతో ఈ రోజున పాఠశాలలో వడ్డించే ఆహారాన్ని పిల్లలు కూడా ఇష్టపడతారు.
చిల్డ్రన్స్ డే మీరు ఎలా జరుపుకుంటారు?
ప్రతి సంవత్సరం నవంబర్ 14 పిల్లలకు మరపురాని రోజు. ఈ రోజున వారు తమ సామాజిక నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చు. క్రీడలు, వారిలో ఉన్న వివిధ నైపుణ్యాలను హృదయపూర్వకంగా ప్రదర్శించగలరు. పాఠశాలలే కాకుండా కళాశాలలు, విద్యాసంస్థల్లో కూడా బాలల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ పిల్లల విద్యను ప్రోత్సహించారు.. దేశంలోని అత్యున్న విద్యాసంస్థల స్థాపనకు కృషి చేశారు. అలాగే, చిన్నారులకు మంచి విద్య, బాల్యం ఉండాలని బలంగా నమ్మారు నెహ్రూ.. ఎందుకంటే నేటి బాలలే మన భావి భాతర భవిష్యత్తు.. ఈ దేశం బాధ్యత వారి భుజాలపై ఉందని అనేక సార్లు గుర్తుచేశారు.