దర్వాజ-హైదరాబాద్
Commercial LPG prices: సిలిండర్ వినియోగ దారులకు గుడ్ న్యూస్.. కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ ధరలు తగ్గాయి. వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరను శనివారం నుండి తగ్గాయి. ఈ ధరలు తక్షణమే అమలులోకి వచ్చేలా యూనిట్‌కు రూ.91.50 తగ్గించినట్లు పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,028గా ఉంది.
పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల ధరల్లో యూనిట్ కు రూ .91.50 తగ్గిస్తూ శనివారం నిర్ణయం తీసుకున్నాయి. ప్రస్తుతం ఢిల్లీలో 19 కిలోల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.2,028కు చేరుకుంది. అయితే, పెట్రోలియం, చమురు మార్కెటింగ్ కంపెనీలు ఈ ఏడాది మార్చి 1న వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను రికార్డు స్థాయిలో పెంచాయి. ఒక్క యూనిట్ పై ఏకంగా రూ.350.50 పెంచాయి. అలాగే, గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను సైతం పెంచాయి.
Read More…
చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ
IPL 2023: అద్దిరిపోయేలా ఐపీఎల్ ఒపెనింగ్ సెరమనీ.. అర్జిత్ సింగ్ తన పాటలతో మైమరపించేశారు.. !
కర్నాటక ఎన్నికలు.. బరిలో నిలిచే ఆప్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే..
జైలు నుంచి విడుదల కానునున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ