దర్వాజ-హైదరాబాద్
MLA Seethakka Fires on Vijayasai Reddy: నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరవుతున్న క్రమంలో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపుతోంది. ఆయన ట్వీట్ పై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు, ములుగు ఎమ్మెల్యే సీతక్క స్పందిస్తూ.. మిమ్మల్ని విజయ సాయి రెడ్డి కాదు.. దొంగసాయి రెడ్డి అని పిలుస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“మీ అవినీతి కేసుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఢిల్లీలో boot foolish చేయమని మేము మిమ్మల్ని అభ్యర్థించాము, కాని మీరు బీజేపీ బూట్లు నాకాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటి నుండి మిమ్మల్ని విజయసాయి రెడ్డి కాదు.. దొంగ సాయిరెడ్డి అని పిలుస్తారు” అని సీతక్క ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.
We requested you to do boot foolish in Delhi to keep yourself safe from your corruption cases but you decide to lick the boots of the BJP, from now you are called as Donga Sai reddy not Vijay Sai Reddy. #DongaSaiReddy @RahulGandhi @revanth_anumula @manickamtagore @INCTelangana https://t.co/l0RWoceDAW
— Danasari Anasuya (Seethakka) (@seethakkaMLA) June 14, 2022
అంతకుముందు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తోడుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆఫీసుకు వెళ్లిన ఫొటోను ట్విట్టర్ లో పోస్టు చేస్తూ.. కర్మ ఫలం ఎక్కడికి పోతుంది అన్నట్లుగా అర్థం వచ్చేలా విజయసాయి రెడ్డి కామెంట్ చేశారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత ప్రజతకు రాహుల్ గాంధీ ముఖం చూపించలేకపోతున్నారనీ, 2024 ఎన్నికల తర్వాత అసలు జనంలోకి రావాలంటే రాహుల్ గాంధీకి ఏకంగా పీపీఈ కిట్ అవసరమవుతుందేమోనంటూ ఎద్దేవా చేశారు. ఇక విజయసాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ రాజకీయ దుమారమే రేపుతోంది. నెటిజన్లు విజయసాయి రెడ్డిని ట్రోల్ చేస్తూ ఆటాడుకుంటున్నారు.
“Karma”….After Punjab, UP, Uttarakhand and Goa election drubbing, @RahulGandhi is finding it hard to show his face in public. I am sure he will need a full body PPE kit after 2024 general election. pic.twitter.com/yksCbbOeUF
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 13, 2022
Share this content: