Breaking
Tue. Nov 18th, 2025

కోర‌మండ‌ల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదం: 50 మంది మృతి, 300 మందికి గాయాలు

Coromandel Express,Kolkata-Chennai,Coromandel Express Accident, Odisha Train Accident, Balasore, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, కోల్‌కతా-చెన్నై, కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదం, ఒడిషా రైలు ప్రమాదం, బాలాసోర్,

ద‌ర్వాజ‌-భువ‌నేశ్వ‌ర్

Coromandel Express Accident: కోర‌మండ‌ల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్ర‌మాదంలో దాదాపు 50 మంది ప్రాణాలు కోల్పోయార‌ని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. అలాగే, ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారి సంఖ్య 300ల‌కు పైగా ఉంది. షాలిమార్ నుంచి చెన్నై వెళ్తున్న కోర‌మండ‌ల్ ఎక్స్ ప్రెస్ ఒడిశాలోని బాల‌సోర్ స‌మీపంలో ప‌ట్టాలు త‌ప్పింది. అనంత‌రం మ‌రో ట్రైన్ ఈ భోగీల‌ను ఢీ కొట్ట‌డంతో ప్ర‌మాదం మ‌రింత‌గా పెరిగింది. మృతుల సంఖ్య మ‌రింగా పెరిగే అవ‌కాశ‌ముంది.

పట్టాలు తప్పిన మరో రైలు బోగీలను ప్యాసింజర్ రైలు ఢీకొనడంతో 300 మందికి పైగా గాయపడ్డారనీ, పలువురు మృతి చెందారని, పలువురు చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని రైల్వే అధికారులు తెలిపారు. కోల్ క‌తా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్ ప్రెస్ బెంగళూరు నుంచి కోల్ క‌తా వెళ్తున్న మరో రైలు బోగీలను ఢీకొట్టిందని రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు.

అధికారులు హెల్ప్ లైన్ నంబర్లను జారీ చేశారు. వందకు పైగా జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డిఆర్ఎఫ్), రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (ఎస్డిఆర్ఎఫ్) సిబ్బంది సహాయక చర్యలు కొన‌సాగిస్తున్నాయి.

హౌరా వద్ద హెల్ప్ లైన్ నంబర్లు – 033 – 26382217
ఖరగ్ పూర్ హెల్ప్ లైన్ 8972073925, 9332392339
బాలాసోర్ హెల్ప్ లైన్ – 8249591559, 7978418322
షాలిమార్ హెల్ప్ లైన్ – 9903370746

Related Post