Breaking
Sat. Jun 28th, 2025

omicron: ఒమిక్రాన్‌.. డెల్టా కంటే 6 రెట్లు అధిక వ్యాప్తి

corona new variant omicron
corona new variant omicron

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

omicron: కరోనా మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ (బీ.1.1.529) ప్రస్తుతం యావత్‌ ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ కరోనా వేరియంట్‌ భారత్‌ లో కల్లోలం సృష్టించిన డెల్టా కన్నా ఆరు రెట్లు ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో కోవిడ్‌ సెకండ్‌వేవ్‌ సమయంలో డెల్టా వేరియంట్ విజృంభ‌ణ‌ను, సంభవించిన సంక్షోభాన్నిగుర్తు చేస్తున్నారు. అదే త‌ర‌హాలో ఒమిక్రాన్‌ వేరియంట్‌లో ప్ర‌మాదం పొంచి వుంద‌నీ, మ‌రీ ముఖ్యంగా విపరీత మ్యుటేషన్లను నిర్వీర్యం చేయడం కష్టమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మోనోక్లోనల్‌ యాంటీబాడీ థెరపీ కానీ కాక్‌టెయిల్‌ ట్రీట్మెంట్‌ కూడా ఒమిక్రాన్‌ వేరియంట్‌ను నిర్వీర్యం చేయదని నిపుణులు చెబుతున్నారు. దక్షిణాఫ్రికాలో నిర్వహించిన ప్రాథమిక విశ్లేషణ ద్వారా నిపుణులు ఈ అభిప్రాయాలు వ్యక్తంచేస్తున్నారు. డెల్టా వేరియంట్‌ కన్నా ఒమిక్రాన్‌ కరోనా ఆర్‌ వాల్యూ చాలా రెట్లు అధికంగా ఉంద‌నీ, దాదాపు ఆరు రెట్లు అధికంగా ఇది వ్యాప్తి చెందుతుంద‌ని పేర్కొంటున్నారు. రోగనిరోధక వ్యవస్థపై అధిక ప్రభావం చూపిస్తుందనీ, ప్రస్తుతమున్న టీకాలు కూడా దీనిపై ప్ర‌భావం చూపించ‌క‌పోవ‌చ్చున‌నే సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా లక్షలమందిని బలిగొన్న డెల్టా వేరియంట్‌.. మోనోక్లోనల్‌ యాంటీబాడీ థెరపీకి స్పందించింది. అయితే డెల్టా నుంచి వచ్చిన డెల్టా ప్లస్‌ వేరియంట్‌ మాత్రం మోనోక్లోనల్‌ థెరపీకి స్పందించలేదు. నిజానికి మోనోక్లోనల్‌ చికిత్స ఓ అద్భుతమని మొదట్లో అనుకున్నారు. కానీ డెల్టా ప్లస్‌పై ఆ చికిత్స పనిచేయకపోవడం కొంత ఆందోళన కలిగిస్తోంది. ఇక ఒమిక్రాన్‌పై ఆ యాంటీబాడీ చికిత్స పనిచేయకపోవచ్చు అన్న సందేహాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఒమిక్రాన్‌లో ఉన్న పలు స్పైక్‌ ప్రోటీన్లు మోనోక్లోనల్‌ యాంటీబాడీలను తట్టుకోగలవని ఐజీఐబీలో పనిచేస్తున్న రీసర్చ్‌ స్కాలర్‌ మెర్సీ రోఫినా తెలిపారు. కొత్తవేరియంట్‌లో మొత్తం 32 స్పైక్‌ ప్రోటీన్‌ వేరియంట్లు ఉన్నాయని చెప్పారు.

చ‌ర్చ లేకుండానే.. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

MSRTC: 6 వేల మంది ఉద్యోగులు సస్పెండ్

ప్చ్..ఇందుకోసమేనా యాంకర్ రవిని ఎలిమినేట్ చేసింది..?

సెల్ ఫోన్ను నిమిషం కూడా చూడకుండా ఉండలేకపోతున్నారా? డౌటే లేదు మీకు ఆ జబ్బులు వచ్చినట్టే..

పొట్టి గౌనులో పెద్ద పాప.. రంగమత్తా అది మర్చిపోయావా ఏంటి?

నీళ్లు మళ్లీ మళ్లీ తాగాలనిపిస్తోందా.. ఈ వ్యాధి కావొచ్చు..

పూల పూల చీరతో పరువాల వాన కురిపిస్తున్న రష్మి

వచ్చే ఏడాది పండుగలు, సెలవులు ఇవే..

Related Post