Loading Now
Covid crisis

క‌రోనా విజృంభ‌ణ‌: మ‌ళ్లీ మూడు వేలు దాటిన కోవిడ్-19 కొత్త కేసులు

దర్వాజ-న్యూఢిల్లీ

COVID-19 India: దేశంలో కోవిడ్-19 కేసులు మ‌ళ్లీ గ‌ణ‌నీయంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో ప్ర‌జ‌ల్లో భ‌యాందోళ‌న‌లు సైతం అధిక‌మ‌వుతున్నాయి. గత 24 గంటల్లో భారతదేశంలో 3,823 కొత్త కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయ‌ని కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. ఇది నిన్నటితో పోలిస్తే 27 శాతం పెరిగింది. అలాగే, గ‌త 24 గంటల వ్యవధిలో ఢిల్లీ, హర్యానా, కేరళ, రాజస్థాన్, కేర‌ళ‌లో ఒక్కొక్కరు చొప్పున క‌రోనా వైర‌స్ తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయారు.

ప్ర‌స్తుతం దేశంలో 18,389 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవి మొత్తం కోవిడ్-19 ఇన్ఫెక్షన్లలో 0.04 శాతంగా ఉన్నాయి. జాతీయ కోవిడ్-19 రికవరీ రేటు 98.77 శాతంగా నమోదైనట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.87 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.24 శాతంగా ఉంది.

కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,41,73,335కి చేరగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల కోవిడ్-19 వ్యాక్సిన్ ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ వెబ్సైట్ తెలిపింది. ఇండియాలో నిన్న కొత్తగా 2,994 కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 16,354 కు పెరిగింది.

అయితే, కొత్త‌గా న‌మోదైన కేసులు దాదాపు ఆరు నెల‌ల్లోనే అత్య‌ధిక‌మ‌ని కోవిడ్-19 గ‌ణాంకాలు పేర్కొంటున్నాయి.

Read More…

IPL 2023లో భారీ సిక్సర్.. 100 మీట‌ర్లు దాటిన ఫ‌స్ట్ సిక్స్ ఎవ‌రు కొట్టారంటే.. ?

తెలంగాణ కంటి వెలుగు.. ఇప్ప‌టివ‌ర‌కు దాదాపు కోటీ మందికి కంటి ప‌రీక్ష‌లు

PBKS vs KKR : ఆరంభంలోనే కోల్ క‌తాను దెబ్బ‌కొట్టిన అర్ష్‌దీప్‌ సింగ్‌..

భార‌త్ లో 2.09% పెరిగిన కోవిడ్-19 పాజిటివిటీ రేటు.. కొత్త‌గా ఎన్ని కేసులు న‌మోద‌య్యాయంటే..?

రక్షణ రంగ సంస్కరణల ఫ‌లిత‌మే ఎగుమ‌తుల పెరుగుద‌ల‌.. : ప్ర‌ధాని న‌రేంద్రం మోడీ

https://darvaaja.com/biggest-six-in-ipl-2023-who-hit-the-first-six-that-crossed-100-meters/

Share this content:

You May Have Missed