Breaking
Tue. Nov 18th, 2025

దేశంలో కొత్తగా 3,998 కరోనా మరణాలు

Covid crisis
Covid crisis
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,16,337
  • మృతుల సంఖ్య మొత్తం 4,18,480

దర్వాజ-న్యూఢిల్లీ

దేశంలో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు సంభవించాయి. ఏకంగా నిన్నటితో పోలిస్తే పది రెట్లు అధికంగా కరోనా మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 42,015  క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,12,16,337కు చేరింది. అలాగే, కొత్తగా 36,977 మంది కోలుకున్నారు.దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,03,90,687 మంది కోలుకున్నారు. 4,07,170 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.

కాగా, కొత్తగా 3,998 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,18,480కు పెరిగింది. నిన్నటితో పోలిస్తే పది రెట్లు అధికంగా కరోనా మరణాలు సంభవించాయి. దేశంలోమంగళవారం నాటికి మొత్తం 44,91,93,273 కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 41,54,72,455 వ్యాక్సిన్ డోసులు వేశారు.


Related Post