Loading Now
India, Covid-19, Coronavirus, క‌రోనా వైర‌స్, కోవిడ్-19, భార‌త్,

Coronavirus: భారీగా కరోనా కొత్త కేసులు.. ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ

Coronavirus: భారత్ లో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్రకారం గ‌త 24 గంట‌ల్లో దేశంలో కొత్త‌గా 18,819 కేసులు న‌మోద‌య్యాయి. ఇదే స‌మ‌యంలో వైరస్ తో పోరాడుతూ 39 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో క‌రోనా కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 5,25,116కు పెరిగింది. మొత్తం కోవిడ్‌-19 కేసుల సంఖ్య 4,34,52,164 చేరుకుంది.

అలాగే, యాక్టివ్ కేసులు 1,04,555కు చేరుకున్నాయి. గ‌త 24 గంట‌ల్లో 13,827 మంది కోలుకున్నారు. కొత్త కేసులు అధికంగా మ‌హారాష్ట్ర, కేర‌ళ‌, క‌ర్నాట‌క‌, త‌మిళ‌నాడు, బెంగాల్, ఢిల్లీల‌లో న‌మోద‌య్యాయి. ఇదిలావుండ‌గా, క‌రోనా ప్ర‌భావం త‌గ్గిపోలేద‌ని ప్ర‌జ‌లంద‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. వంద‌కు పైగా దేశాల్లో ప్ర‌స్తుతం క‌రోనా కేసులు ప్ర‌మాద‌క‌రంగా పెరుగుతున్నాయ‌ని తెలిపింది.

Share this content:

Previous post

Udaipur: ఉదయ్‌పూర్‌లో క్రూర హ‌త్య‌.. ఉద్రిక్త ప‌రిస్థితులు.. ఇంట‌ర్నెట్ ష‌ట్‌డౌన్‌.. భారీగా పోలీసుల మోహ‌రింపు

Next post

Eknath Shinde: మ‌హారాష్ట్ర కొత్త సీఎంగా ఎక్‌నాథ్ షిండే.. రాత్రి 7:30ల‌కు ప్ర‌మాణ‌స్వీకారం.. టాప్‌-10 పాయింట్స్

You May Have Missed