దర్వాజ-హైదరాబాద్
BJP national President JP Nadda: బీజేపీ చీఫ్ జేపీ నడ్డా మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అవినీతికి మరో పేరుగా బీఆర్ఎస్ సర్కారు గుర్తింపు పొందిందని విమర్శించారు. తెలంగాణ సర్కారుకు అవినీతి గుర్తింపుగా మారిందని అన్నారు. తెలంగాణలో ప్రతిరంగంలో నేడు స్కామ్ లు జరుగుతున్నాయంటూ విమర్శించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కొత్త బీజేపీ కార్యాలయాలను వర్చువల్ గా ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ నడ్డా మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.
ఏపీ, తెలంగాణ ల్లో ఉన్న వైకాపా, బీఆర్ఎస్ ప్రభుత్వాలను టార్గెట్ చేస్తూ ఆయన విమర్శలు గుప్పించారు. ఏపీకి అన్ని విధాల సాయం అందిస్తున్నామని పేర్కొన్న నడ్డా.. వైకాపా ప్రభుత్వం మాత్రం కేంద్ర పథకాలను అమలు చేయడంలో విఫలమైందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్కాముల్లో నిండిపోయిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు మిగులు రాష్ట్రంగా ఉండగా, బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం రూ.3.29 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ సర్కారును భ్రష్టచార్ రిష్వత్ సర్కారుగా పేర్కొన్నారు. బీఆర్ఎస్ కు అధికారంలో ఉండే హక్కు లేదని విమర్శించారు. పేరు మార్పును ప్రస్తావిస్తూ.. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చినంత మాత్రాన ఒరిగేదేమీలేదని అన్నారు. పేరు మాత్రమే మారిందనీ, అవినీతి అలాగే ఉందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం ఇస్తారని తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పై కూడా ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు.
Read More…
చెన్నై సూపర్ కింగ్స్ పై గుజరాత్ టైటాన్స్ గ్రాండ్ విక్టరీ
IPL 2023: అద్దిరిపోయేలా ఐపీఎల్ ఒపెనింగ్ సెరమనీ.. అర్జిత్ సింగ్ తన పాటలతో మైమరపించేశారు.. !
కర్నాటక ఎన్నికలు.. బరిలో నిలిచే ఆప్ అభ్యర్థుల రెండో జాబితా ఇదే..
జైలు నుంచి విడుదల కానునున్న నవజ్యోత్ సింగ్ సిద్ధూ