Loading Now
India, Covid-19, Coronavirus, క‌రోనా వైర‌స్, కోవిడ్-19, భార‌త్,

కోవిడ్-19 అలర్ట్: ఆక్సిజ‌న్ సరఫరాపై రాష్ట్రాల‌కు కేంద్రం లేఖ

దర్వాజ-న్యూఢిల్లీ

Coronavirus: ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కొత్త‌ కేసులు పెరుగుతుండ‌టంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలను అలర్ట్ చేస్తూ మరోసారి లేఖ రాసింది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే, ఆక్సిజన్ సరఫరాపై సమీక్షలు జరపాలనీ, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు చేసిన సూచనలు..

  • ప్ర‌పంచవ్యాప్తంగా కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. చైనా సహా పలు దేశాల్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో చైనా, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా పరీక్షలు తప్పనిసరి చేసినట్టు కేంద్రం పేర్కొంది.
  • విదేశీ ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయడంతో పాటు లక్షణాలు కనిపించినా, పాజిటివ్ వచ్చినా వారిని క్వారంటైన్ లో ఉంచుతారు.
  • 2021-కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఆక్సిజన్ కొరత ఏర్పడింది. మళ్లీ అలాంటి ప‌రిస్థితులు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర కోరింది.
  • భవిష్యత్తులో కోవిడ్ కేసులు పెరిగితే వచ్చే ఏవైనా సవాళ్లను ఎదుర్కోవటానికి, ఈ వైద్య మౌలిక సదుపాయాల నిర్వహణ ముఖ్యమని సంబంధిత చర్యలు తీసుకోవాలని పేర్కొంది.
  • మెడికల్ ఆక్సిజన్ కోసం పీఎస్ఏ ప్లాంట్లు పూర్తిగా పనిచేయడం, రెగ్యులర్ గా వాటిపై సమీక్షలు నిర్వహించాలని సూచించింది.
  • వైద్యారోగ్య కేంద్రాల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ లేదా ఎల్ఎంవో లభ్యత, వాటి రీఫిల్లింగ్ కోసం సరఫరా గొలుసుకు అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది.

Share this content:

You May Have Missed