దర్వాజ-న్యూఢిల్లీ
India reports 11,109 new Coronavirus cases: దేశంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. కొత్తగా దేశంలో 11 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కోవిడ్-19తో పోరాడుతూ 29 మంది మరణించారు. అప్రమత్తమైన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు చర్యలు తీసుకుంటున్నాయి. యాక్టివ్ కేసులు సైతం 50 వేలకు మర్కుకు చేరువయ్యాయి.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం ఉదయం వెల్లడించిన కోవిడ్-19 వివరాల ప్రకారం.. భారత్ లో గత 24 గంటల్లో కొత్తగా 11,109 కోవిడ్ -19 కేసులు, 29 మరణాలు నమోదయ్యాయి. కేసులు గత ఏడు నెలల్లోనే అత్యధికమని గణాంకాలు పేర్కొంటున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ యాక్టివ్ కేసుల సంఖ్య 49,622కు చేరుకుంది. కొత్తగా 29 మంది కోవిడ్ తో మరణించారు. మొత్తం మరణాల సంఖ్య 5,31,064కు చేరుకుంది. ఇప్పటివరకు మొత్తం 4,42,16,583 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.
కోవిడ్-19 రోజువారీ పాజిటివిటీ రేటు 5.01 శాతంగా నమోదైంది. వీక్లీ పాజిటివిటీ రేటు 4.29 శాతానికి చేరుకుంది. జాతీయ వ్యాక్సినేషన్ డ్రైవ్ కింద ఇప్పటివరకు మొత్తం 2,20,66,25,120 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశారు.