దర్వాజ-పంజాబ్
Navjot Singh Sidhu to be released tomorrow: పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ శనివారం (ఏప్రిల్ 1న) జైలు నుంచి విడుదలకానున్నారు. 1988 నాటి రోడ్డు ప్రమాదం కేసులో ఆయన జైలులో ఉన్నారు. సిద్ధూ సత్ప్రవర్తన కారణంగా ఆయనను ముందస్తుగా విడుదల చేయనున్నట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
వివరాల్లోకెళ్తే.. ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించిన నవజ్యోత్ సింగ్ సిద్ధూ రేపు విడుదల కానున్నారు. పాటియాలా సెంట్రల్ జైలు నుంచి ఆయన శనివారం విడుదలయ్యే అవకాశం ఉంది. 1988 రోడ్డు ప్రమాదం కేసులో సుప్రీంకోర్టు దోషిగా తేలడంతో గత ఏడాది మే 20 నుంచి ఆయన జైలులో ఉన్నారు. రోడ్డు ప్రమాదం కేసులో సుప్రీంకోర్టు విధించిన ఏడాది కఠిన కారాగార శిక్ష పూర్తికానున్న నేపథ్యంలో ఆయన విడుదల కానున్నారని సంబంధిత అధికార వర్గాలను ఊటంకిస్తూ ట్వీట్ చేశారు.
1988 రోడ్డు ప్రమాదం కేసు
నవజ్యోత్ సింగ్ సిద్ధూ 1988లో జరిగిన రోడ్డు ప్రమాదంలో నిందితుడిగా ఉన్నాడు. 1988 డిసెంబర్ లో సిద్ధూ, అతని స్నేహితుడు వెళ్తున్న కారుతో దాడి చేయడంతో పాటియాలాకు చెందిన గుర్నామ్ సింగ్ అనే వ్యక్తి మరణించాడు.