Loading Now
Cloudy sky, Hyderabad, IMD, Rainfall, Telangana, మేఘావృతమైన ఆకాశం, హైదరాబాద్, ఐఎండీ, వర్షపాతం, తెలంగాణ,Karnataka , క‌ర్ణాట‌క‌,

Cyclone Asani: తీవ్ర‌రూపం దాల్చిన అసని తుఫాను..

దర్వాజ-భువనేశ్వర్

cyclonic storm Asani : ఆగ్నేయ బంగాళాఖాతంలో ఆదివారం ఏర్పడిన తీవ్ర అల్పపీడనం గత 6 గంటల్లో గంటకు 16 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి తుపానుగా మారిందని, అసని తుఫానుగా మారిందని భౄర‌త వాతావ‌ర‌ణ విభాగం (IMD) తెలిపింది. ఉదయం 5.30 గంటలకు ఆగ్నేయ బంగాళాఖాతంపై కేంద్రీకృతమై ఉండ‌గా, కోర్ నికోబార్ (నికోబార్ దీవులు)కు పశ్చిమ-వాయువ్యంగా 450 కి.మీ., పోర్ట్ బ్లెయిర్ (అండమాన్ దీవులు)కి పశ్చిమాన 380 కి.మీ., విశాఖపట్నం (ఆంధ్రప్రదేశ్)కి 970 కి.మీ ఆగ్నేయంగా మరియు 1030 కి.మీ. పూరి (ఒడిశా)కి దక్షిణ-ఆగ్నేయంగా కేంద్రీకృత‌మై ఉంద‌ని తెలిపింది.

వచ్చే 24 గంటల్లో ఇది వాయువ్య దిశగా పయనించి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని, మే 10 సాయంత్రం వరకు ఇది వాయువ్య దిశగా పయనిస్తూ పశ్చిమానికి చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని కార‌ణంగా ఉత్తర ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలకు మధ్య మరియు ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంపై ప్ర‌భావం ఉంటుద‌ని పేర్కొంది.

Share this content:

You May Have Missed