Loading Now
Cloudy sky, Hyderabad, IMD, Rainfall, Telangana, మేఘావృతమైన ఆకాశం, హైదరాబాద్, ఐఎండీ, వర్షపాతం, తెలంగాణ,Karnataka , క‌ర్ణాట‌క‌,

Cyclonic storm: ముంచుకొస్తున్న తుఫాను.. ఐఎండీ హెచ్చ‌రిక‌లు !

దర్వాజ-హైదరాబాద్

India Meteorological Department: దక్షిణ అండమాన్ సముద్రం మరియు దానిని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మే 8 నాటికి తుఫానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా బలపడి వచ్చే వారం ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్-ఒడిశా తీరానికి చేరుకునే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) శుక్రవారం అంచనా వేసింది. ఈ క్ర‌మంలోనే ఒడిశా ప్రభుత్వం తుఫాను పరిస్థితుల‌ను ఎదుర్కొనేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. తుఫాను ప్రభావిత జిల్లాలను అప్రమత్తం చేసింది.

దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం ఆనుకుని ఉన్న అల్పపీడనం శనివారం నాటికి వాయువ్య దిశగా పయనించి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఆదివారం సాయంత్రం నాటికి ఈ ఇది తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. మే 10న తీరం చేరే అవకాశం ఉందని ఐఎండీ అంచ‌నా వేసింది. ఐఎండీ సూచ‌న‌ల‌ మేరకు కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీని అప్రమత్తం చేసినట్లు ఒడిశా ప్రభుత్వం తెలిపింది. తుపాను దృష్ట్యా మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని ఆదేశించింది. తుఫాను పరిస్థితులను ఎదుర్కోవటానికి వార్-రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే NDRF 17 బృందాలు, ODRAF 20 బృందాలు, 175 అగ్నిమాపక సేవల బృందాలు హై అలర్ట్‌గా ఉంచినట్లు ఒడిశా స్పెషల్ రిలీఫ్ కమీషనర్ PK జెనా తెలిపారు.

Share this content:

You May Have Missed