దర్వాజ-బెంగళూరు
dancer collapses during live performance: కర్నాటకలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. దక్షిణ కన్నడ జిల్లాలో ఒక ప్రదర్శన మధ్యలో కుప్పకూలి స్థానిక దేవత నృత్యకారుడు (దైవ నర్తక) క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతున్ని కడబ తాలూకా ఎడమంగళకు చెందిన కంతు (60)గా గుర్తించారు.
ఇద్యాద్కా అనే గ్రామంలో దేవతల ప్రసన్నం చేసుకోవడానికి చేసే సాంప్రదాయాక నృత్య ప్రదర్శనల సందర్భంగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రదర్శన ఇస్తున్న సమయంలో డ్యాన్సర్ అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడనీ, ఆయన్ను బతికించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కోలా అనే మతపరమైన వేడుకలో భాగంగా ఈ నృత్య ప్రదర్శన జరిగింది.