Loading Now

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసు: సీఎం కేసీఆర్ కుమార్తె మాజీ సహాయకుడు అరెస్టు

ద‌ర్వాజ‌-న్యూఢిల్లీ
‍‍‍
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో హైదరాబాద్ కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్లను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) బుధవారం అరెస్టు చేసింది. నిందితుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత మాజీ అనుచరుడిగా భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇవాళ ఆయనను కోర్టులో హాజరుపరచనున్నారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ రూపకల్పన, అమలులో గోరంట్ల ప్రమేయం ఉన్నట్లు సమాచారం.

ఇప్పుడు రద్దు చేసిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీలో ఆయన పాత్ర హైదరాబాద్ కు చెందిన హోల్సేల్, రిటైల్ లైసెన్సులు, వాటి ప్రయోజనకరమైన యజమానులకు అక్రమంగా లాభం కలిగించిందని సీబీఐ ఆరోపించింది. ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ కుమార్తె కవితను డిసెంబర్ 12న హైదరాబాద్ లో సీబీఐ అధికారులు విచారించిన విషయం తెలిసిందే.

లిక్కర్ పాలసీ కేసులో ముడుపుల ద్వారా లబ్దిపొందిన ‘సౌత్ కార్టెల్’లో ఆమె భాగమని ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఆరోపించింది.

Share this content:

You May Have Missed