Breaking
Tue. Nov 18th, 2025

Delhi Liquor Policy Case: మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీ మే 23 వరకు పొడిగింపు

Manish Sisodia

దర్వాజ-న్యూఢిల్లీ

Court Extends Manish Sisodia’s Judicial Custody: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి, ఆప్ నాయ‌కుడు మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు మే 23 వరకు పొడిగించింది. ఇదే స‌మ‌యంలో మద్యం కుంభకోణం కేసులో ఇద్దరు నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ నేతలు ఈ మొత్తం వ్యవహారంపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తూ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కావాల‌నే ఆప్ నాయ‌కుల‌పై కుట్ర ప‌న్నుతున్నార‌ని ఆరోపిస్తున్నారు.

ఇద్దరు నిందితులకు బెయిల్ మంజూరైనప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఈ కేసును ఫేక్ అని కొట్టిపారేశారు. సోమవారం ఉదయం ఆయన ట్వీట్ చేస్తూ.. ‘మొత్తం మద్యం కుంభకోణం అవాస్తవం. మేము మొదటి నుండి చెబుతున్నాము. ఇప్పుడు కోర్టులు కూడా చెబుతున్నాయి. ఆప్ వంటి నిజాయితీ గల పార్టీని అప్రతిష్టపాలు చేసేందుకు బీజేపీ చేస్తున్న ఎత్తుగడ ఇది. అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే కోర్టు మనీష్ సిసోడియా జ్యుడీషియల్ కస్టడీని మే 23 వరకు పొడిగించింది.

Related Post