Loading Now
Massive Fire, Storey Building, Delhi, massive fire broke out, commercial building, Mundka metro station, Massive Fire At 3-Storey Building In Delhi, Delhi fire accident,

Delhi Mundka fire : ఢిల్లీ అగ్నిప్ర‌మాదంపై మెజిస్టీరియల్ విచారణ..10 ల‌క్ష‌ల ఎక్స్‌గ్రేషియా: కేజ్రీవాల్

దర్వాజ-న్యూఢిల్లీ

Mundka fire accident: పశ్చిమ ఢిల్లీలోని ముండ్కా మెట్రో స్టేషన్ సమీపంలోని వాణిజ్య భవనంలో ఈ అగ్ని ప్ర‌మాదం చోటుచేసుకుంది. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది భవనం నుంచి 60-70 మందిని రక్షించినట్లు పోలీసులు తెలిపారు. అప్ప‌టికే 27 మంది ప్రాణాలు కోల్పోయారు. గాప‌డ్డ‌వారిని వైద్యం నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వీరిలో ప‌లువురి ప‌ర‌స్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు.

ముండ్కా అగ్నిప్రమాదంపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. అగ్నిప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

కాగా, ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి ఎవ‌రు త‌ప్పుచేసినా వారిపై చ‌ట్ట‌ప్ర‌కారం క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని పోలీసులు తెలిపారు. విద్యుత్ పేలుడు కారణంగానే ఈ ఘటన జరిగిందని ఢిల్లీ అగ్నిమాపక అధికారి తెలిపారు. విద్యుత్‌ పేలుడు కారణంగా మంటలు చెలరేగాయని ఢిల్లీ ఫైర్‌ సర్వీస్‌ చీఫ్‌ ఆఫీసర్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. శిథిలాలలో అనేక కాలిపోయిన అవశేషాలు కనుగొనబడినందున మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆయన అన్నారు. భ‌వ‌న యజమానులు హరీష్ గోయెల్, వరుణ్ గోయెల్‌లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Share this content:

You May Have Missed