దర్వాజ-అమరావతి
AP Home Minister Dr. Taneti Vanitha: రేషన్ పంపిణీ విధానంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మక చర్యలతో ప్రతి నెలా రేషన్ తీసుకునేవారి శాతం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర హోంమంత్రి, ప్రకృతి విపత్తు నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత (Dr. Taneti Vanitha) తెలిపారు.
కొవ్వూరు పట్టణం 1వ వార్డులో రాజీవ్ కాలనీలో 119వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని హోంమంత్రి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గడపగడపకు వెళ్లి ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటుండగా.. అక్కడ ఇంటింటికి రేషన్ సరఫరా చేసే ఒక ఎండీయూ వాహనాన్ని ఆమె పరిశీలించారు. రేషన్ కార్డుదారులకు నిత్యావరాలను హోంమంత్రి స్వయంగా పంపిణీ చేసి ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం చేపల వలలు అల్లుకుంటున్న మత్స్యకార కుటుంబాల పరిస్థితులను ఆరా తీశారు. మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వ సబ్సిడీపై ఫైబర్ బోట్లు ఇంజన్లు వలలు అందించాలని హోంమంత్రి తానేటి వనితను కోరారు.
ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి కుటుంబానికి అందుతున్న సంక్షేమాన్ని లెక్కలతో సహా కుటుంబ సభ్యులకు ఆమె వివరించారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వెంటనే పరిష్కరించాలని సచివాలయ సిబ్బందినీ, అన్ని శాఖల అధికారులను హోంమంత్రి తానేటి వనిత ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Share this content: