Doctor Preethi died: డాక్టర్ ప్రీతి కన్నుమూత..

Doctor Preethi died, Doctor Preethi, Warangal KMC, NIMS, డాక్ట‌ర్ ప్రీతి, వ‌రంగ‌ల్ కాక‌తీయ మెడిక‌ల్ కాలేజీ, నిమ్స్, ప్రీతి, సైఫ్, Saif,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Doctor Preethi died: ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతున్న డాక్టర్ ప్రీతి కన్నుమూత క‌న్నుమూశారు. వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి (Doctor Preethi) ఆదివారం నాడు ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయార‌ని వైద్యులు తెలిపారు. ఆమె మ‌ర‌ణ వార్త విని కుటుంబ స‌భ్యులు, స్నేహితులు కన్నీరుమున్నీరవుతున్నారు.

డాక్టర్ ప్రీతి ఐదురోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఆరోగ్యం మ‌రింత‌గా క్షీణించి ఆదివారం రాత్రి 9.10 గంటలకు మృతి చెందినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ప్రీతిని కాపాడేందుకు ప్రత్యేక వైద్య బృందం అన్నివిధాలుగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింద‌ని చెప్పారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి.. ట్రైనింగ్ లో భాగంగా ఎంజీఎంలో (MGM) విధులు నిర్వహిస్తుండేది.

సీనియర్ మెడికో సైఫ్ వేధింపుల త‌ట్టుకోలేక ప్రీతి ఒక హానిక‌ర ఇంజక్షన్ త‌న‌కు తానుగా తీసుకునీ, అపస్మారక స్థితిలోకి వెళ్లింది. విష‌యం తెలుసుకున్న తోటి విద్యార్థులు వెంట‌నే వరంగల్‌లోని ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం ఎంజీఎంకు త‌ర‌లించారు. అయితే, ఆరోగ్యం మెరుగుప‌డ‌క పోవ‌డంతో హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించి చికిత్స అందించారు. అయితే, హానికర ఇంజక్షన్ తీసుకోవడం వల్ల మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అయ్యాయ‌నీ, దీంతో ప్రాణాలు కోల్పోయిన‌ట్టు వైద్యులు తెలిపారు.

నిందితుడు సైఫ్ అరెస్ట్

డాక్టర్‌ ప్రీతి కేసులో నిందితుడు సైఫ్‌ను మట్టెవాడ పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుచ‌గా, 14 రోజుల రిమాండ్‌ విధించింది. ఖమ్మం జైలులో ఉంచారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదైంద‌ని పోలీసు వ‌ర్గాలు పేర్కొన్నాయి.

Related Post