Loading Now
DRDO Agni Prime missile

డీఆర్‌డీవో ‘అగ్నిప్రైమ్‌’ క్షిప‌ణీ

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

దేశానికి అత్యాధునికమైన రక్షణ ఆయుధాలు, క్షిపణీ వ్యవస్థలను అందిచడమే కాకుండా.. కరోనా సంక్షోభ స‌మయంలోనూ తనదైన సేవలను అందిస్తూ డీఆర్‌డీవో ముందుకు సాగుతోంది. కరోనా నేపథ్యంలో అత్యాధునిక‌ వెంటిలేటర్లు, పీపీఈ కిట్లు, మాస్కులు, ఆక్సిజన్‌, ఆక్సిజన్‌ ప్లాంట్ల నిర్మాణానికి అవసరమైన పరికరాలు తయారు చేయడంతో పాటు కరోనా చికిత్స కోసం ‘యాంటీ కోవిడ్‌ డ్రగ్‌ 2డీజీ’ ని సైతం అభివృద్ధి చేసింది. దీంతో పాటు ఇదే సమయంలో ఏకంగా 52 కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను అభివృద్ధి చేసింది.

ప్ర‌స్తుతం రక్షణ పరికరాలపై దృష్టి సారించిన డీఆర్‌డీవో.. వచ్చే వారంలో మరో సరికొత్త అగ్ని సిరీస్‌ క్షిపణీ పరీక్షలు జరపడానికి సిద్ధమవుతోంది. అగ్ని సిరీస్‌కు చెందిన సరికొత్త క్షిపణీని జూన్‌28, 29 తేదీలలో ఒడిశా తీరంలోని రక్షణ వ్యవస్థ స్థావరం నుంచి పరీక్షించనున్నట్టు డీఆర్‌డీవో వర్గాలు వెల్లడిరచాయి. ‘అగ్నిప్రైమ్‌’గా నామకరణం చేసిన ఈ క్షిపణీ 1000 కిలోమీటర్ల నుంచి 1500 కిలో మీటర్ల లక్ష్యాలను చేరుకోవడానికి అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన పనులన్నీ చివరి దశకు చేరుకున్నాయన్నారు. గతేడాది సెప్టెంబర్‌, అక్టోబర్‌ సమయంలో ఏకంగా 12 క్షిపణులను డీఆర్‌డీవో విజ‌య‌వంతంగా ప‌రీక్షించింది.

Share this content:

You May Have Missed