Breaking
Tue. Nov 18th, 2025

తెలంగాణలో భూకంపం.. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదు

Earthquake, Rajasthan, Bikaner, NCS, భూకంపం, రాజ‌స్థాన్, ఎన్సీఎస్, బిక‌నీర్,

Telangana Earthquake: నిజామాబాద్‌కు వాయువ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో ఆదివారం రిక్టర్‌ స్కేలుపై 3.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మోలజీ (ఎన్‌సీఎస్‌) తెలిపింది. ఆదివారం ఉదయం 8:12 గంటలకు రాష్ట్రంలో 5 కిలోమీటర్ల లోతులో, 19.43 అక్షాంశం‍ ‍- 77.27 రేఖాంశంలో భూకంపం సంభవించింది.

కాగా, భూకంపం నేపథ్యంలో ప్రాణ నష్టం లేదా ఆస్తినష్టం గురించి ఇంకా సమాచారం లేదు. అంతకుముందు జనవరి 24 న, మంగళవారం ఢిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో బలమైన ప్రకంపనలు సంభవించాయి. కనీసం 15 సెకన్ల పాటు భూకంపం సంభవించింది, ప్రజలు తమ ఇళ్లు, కార్యాలయాల నుండి బయటకు పరుగులు తీయడం కనిపించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ సిస్మోలజీ ప్రకారం, భూకంప కేంద్రం నేపాల్‌లో కేంద్రీకృతమై ఉంది.

Related Post