Loading Now
earthquake in Pakistan

పాకిస్థాన్‌లో భారీ భూకంపం

• 22 మంది మృతి.. 300 మందికి పైగా తీవ్ర గాయాలు
• మృతుల సంఖ్య మ‌రింత‌గా పెరిగే అవ‌కాశం: అధికారులు

ద‌ర్వాజ-అంత‌ర్జాతీయం
earthquake in Pakistan: పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో గురువారం ఉదయం 5.9 తీవ్రతతో భూకంపం సంభ‌వించింది. భారీ భూకంపం కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు 22 మంది ప్రాణాలు క‌ల్పోయారు. 300 మందికి పైగా మ‌ర‌ణించారు. అనేక ఇండ్లు కూలిపోయాయి. దీనిపై అధికారులు మాట్లాడుతూ.. స‌హాయ చ‌ర్య‌లు కొన‌సాగుతున్నాయ‌ని తెలిపారు. శిథిలాల కింత చిక్కుకుపోయిన వారు చాలా మంది ఉంటార‌నీ, దీని కార‌ణంగా మృతులు పెరిగే అవ‌కాశ‌ముంద‌ని అధికారులు తెలిపిన‌ట్టు జియో న్యూస్ నివేదించింది.

కాగా, భూకంపం కార‌ణంగా 300 మంది తీవ్రంగా గాయ‌ప‌డ‌గా, వారిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని వైద్యులు తెలిపారు. భూకంప కేంద్రం హర్నాయ్ సమీపంలో 15 కిలోమీటర్ల లోతులో ఉన్నట్టు ఇస్లామాబాద్‌లోని నేషనల్ సీస్మిక్ మానిటరింగ్ సెంటర్ తెలిపింది. బలూచిస్తాన్‌లోని క్వెట్టా, సిబి, హర్నాయ్, పిషిన్, ఖిలా సైఫుల్లా, చమన్, జియారత్, జోబ్‌లలో భూకంప తీవ్ర‌త అధికంగా ఉంది. కాగా, ఆర్థిక న‌ష్టం భారీగానే సంభ‌వించింద‌ని అధికారులు పేర్కొంటున్నారు.

ఇది తక్కువ లోతులో 5.9 తీవ్రతతో సంభవించిన భూకంపమని అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. 22 మంది చ‌నిపోయిన‌ట్టుగా హ‌ర్నాయ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ సోహైల్ అన్వర్ హష్మి నిర్ధారించారు. మృతుల్లో ఆరుగురు పిల్లలు ఉండ‌గా, అధికంగా మ‌హిళ‌లు ఉన్నారు. ఇక 2015, అక్టోబర్‌ నెలలో పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌ సరిహద్దుల్లో 7.5 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో 400 మంది మృతిచెందారు. 2005, అక్టోబర్‌ 8న వచ్చిన భూకంపం వల్ల సుమారు 74 వేల మంది మరణించగా, 30.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. 2013లో సంభ‌వించిన మ‌రో భూకంపంలో 825 మంది చ‌నిపోయారు.

https://darvaaja.com/farmerprotest/

కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడే కారు న‌డిపాడు: గాయపడ్డ రైతు

బ్లాక్ ఫంగస్.. ప్ర‌పంచంలోని మొత్తం కేసుల్లో 71 శాతం భారత్‌లోనే..

రైతుల‌పైకి దూసుకెళ్లింది మా కారే.. : కేంద్ర మంత్రి అజ‌య్ మిశ్ర‌

బొగ్గు సంక్షోభంతో క‌రెంట్ కష్టాలు..

నిలిచిపోయిన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్..

అఫ్ఘాన్‌లో బాంబు దాడి.. 14 మంది మృతి

రైతుల‌పైకి దూసుకెళ్లిన కేంద్ర‌మంత్రి కాన్వాయ్‌.. 8 మంది మృతి

లింగ వివక్ష.. పితృస్వామ్యం.. మధ్యలో మహిళ !

పెరిగిన పెట్రోల్ ధరలు.. సెంచరీ కొట్టిన డీజిల్

లాల్ బహదూర్ శాస్త్రి మ‌ర‌ణం వెనుక కార‌ణాలు..

Share this content:

You May Have Missed