ట‌ర్కీపై ప్ర‌కృతి ప్ర‌కోపం.. భారీ భూకంపం కారణంగా 2300 మందికి పైగా మృతి

ట‌ర్కీ, సిరియా, భూకంపం, ఇస్తాంబుల్, Turkey, Syria, Earthquake, Istanbul,

దర్వాజ-అంతర్జాతీయం

turkey-syria earthquake: టర్కీ లో భారీ భూకంపం సంభ‌వించింది. 2300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని మీడియా నివేదిక‌లు పేర్కొంటున్నాయి. భూకంప‌ తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 7.7గా నమోదయింది. పెద్ద సంఖ్య‌లో భ‌వ‌నాలు కుప్ప‌కూలాయి. సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు దక్షిణ టర్కీలోని నూర్దాగీ సమీపంలో భూ ప్ర‌కంప‌న‌లు వ‌చ్చాయి. భూకంప కార‌ణంగా పెద్ద సంఖ్య‌లో ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభ‌వించింది. శిథిలాల కింద పెద్ద సంఖ్య‌లో చిక్కుకుని పోయార‌ని స‌మాచారం. విప‌త్తు నిర్వ‌హ‌ణ పనులు కొన‌సాగుతున్నాయి.

ప్ర‌స్తుత రిపోర్టులు ప్ర‌కారం.. సోమవారం (ఫిబ్రవరి 6) ఉదయం టర్కీ-మధ్యప్రాచ్యంలో రెండు శక్తివంతమైన భూకంపాల ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కార‌ణంగా 2300 మందికి పైగా చనిపోయారని అంత‌ర్జాతీయ మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. మాల్టా-సాన్లుయిర్ఫాల‌లో మ‌ర‌ణాల సంఖ్య ఎక్కువ‌గా ఉంది. సోమ‌వారం తెల్లవారుజామున 4.17 గంటలకు మొదటి భూకంపం సంభవించగా, కొన్ని నిమిషాల తర్వాత సెంట్రల్ టర్కీలో రెండో ప్రకంపనలు సంభవించాయి.

కహ్మెన్‌మార్ష్, హటే, గజియాంటెప్, ఉస్మానియే, అడియామాన్, సాన్లియుర్ఫా, మలత్య, అదానా, దియార్‌బాకిర్, కిలిస్ లపై భూకంప ప్ర‌భావం అధికంగా ఉంది. భూకంపం తర్వాత హై అలర్ట్ ప్రకటించబడినట్లు టర్కీ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది.

Related Post