దర్వాజ-హైదరాబాద్
Eklavya Model Residential School: దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య పాఠశాలల్లో 6300కు పైగా టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల అయింది. ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ 6329 టీజీటీ, హాస్టల్ వార్డెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో టీజీటీ 5660, హాస్టల్ వార్డెన్ పురుష పోస్టులు 335, హాస్టల్ వార్డెన్ మహిళ పోస్టులు 334 ఉన్నాయి.
సబ్జెక్టుల వారీగా పోస్టులు:
ఈఎంఆర్ఎస్ స్టాఫ్ సెలక్షన్ ఎగ్జామినేషన్ (ఈఎస్ఎస్ఈ) 2023 కోసం ఈ నియామకాలు జరుగుతాయి. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నెస్ట్స్ పరీక్ష నిర్వహిస్తోంది. అభ్యర్థులు ఆగస్టు 18 వరకు emrs.tribal.gov.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. మొత్తం పోస్టులలో హిందీ 606, ఇంగ్లిష్ 671, మ్యాథ్స్ 686, సోషల్ స్టడీస్ 670, సైన్స్ 678 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ మెయిల్, పీఈటీ ఫీమేల్, లైబ్రేరియన్, టీజీటీ బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మణిపురి, మరాఠీ, ఒరియా, తెలుగు, ఉర్దూ నుంచి కూడా పోస్టులు ఉన్నాయి.
పరీక్ష సమయం:
టీజీటీ పోస్టుకు 180 నిమిషాలు, హాస్టల్ వార్డెన్ పోస్టుకు 150 నిమిషాలు పరీక్ష ఉంటుంది. పేపర్ ఓఎంఆర్ ఆధారితంగా ఉంటుంది.
టీజీటీ పోస్టుకు అర్హత:
సంబంధిత సబ్జెక్టుతో గ్రాడ్యుయేషన్, బీఎడ్, సీటెట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
హాస్టల్ వార్డెన్ కు ఏదైనా విభాగం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. లేదా ఎన్ సీఈఆర్ టీకి చెందిన రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సు ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
గరిష్ట వయోపరిమితి:
35 సంవత్సరాలు వయస్సును గరిష్ట వయోపరిమితిగా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
పే స్కేల్:
టీజీటీ (ఇంగ్లిష్, హిందీ, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్, థర్డ్ లాంగ్వేజ్, లైబ్రేరియన్) – లెవల్ 7కు రూ.44900 – రూ.142400 వరకు ఉంటుంది.
ఇతర టీజీటీ పోస్టులు – మ్యూజిక్, ఆర్ట్, పీఈటీ – లెవల్ 6కు రూ. 35400 – 112400 వరకు పే స్కేల్ ఉంటుంది.
హాస్టల్ వార్డెన్ – లెవల్ 5కి రూ.29200-92300 వరకు పే స్కేల్ ఉంటుంది.
దరఖాస్తు ఫీజు:
టీజీటీ – రూ.1500 హాస్టల్ వార్డెన్ – రూ.1000 దరఖాస్తు ఫీజు ఉంటుంది. అడ్మిట్ కార్డు విడుదల, పరీక్ష తేదీలను నెస్ట్స్ తర్వాత ప్రకటిస్తుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.