దర్వాజ-న్యూఢిల్లీ
ED files case against BBC India: బీబీసీ ఇండియాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కేసు నమోదు చేసింది. విదేశీ మారకద్రవ్య ఉల్లంఘనలకు సంబంధించి న్యూస్ బ్రాడ్ కాస్టర్ బీబీసీ ఇండియాపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఫెమా కేసు నమోదు చేసిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) నిబంధనల ప్రకారం కొందరు కంపెనీ ఎగ్జిక్యూటివ్ ల వాంగ్మూలాలను రికార్డు చేయాలని ఫెడరల్ దర్యాప్తు సంస్థ కోరింది.
కంపెనీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్ డీఐ) ఉల్లంఘనలపై దర్యాప్తు జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఫిబ్రవరిలో ఢిల్లీలోని బీబీసీ కార్యాలయ ప్రాంగణాన్ని ఆదాయపు పన్ను శాఖ సర్వే చేసిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. వివిధ బీబీసీ గ్రూప్ సంస్థలు చూపించిన ఆదాయం, లాభాలు భారతదేశంలో తమ కార్యకలాపాల స్థాయికి అనుగుణంగా లేవనీ, విదేశీ సంస్థలు కొన్ని రెమిటెన్స్ లపై పన్ను చెల్లించలేదని ఐటి శాఖ పరిపాలనా సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) తెలిపింది.