దర్వాజ-క్రీడలు
ENG vs NZ Semi Final T20 WC 2021: టీ20 ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ తన అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ.. ఫైనల్ చేరుకుంది. బుధవారం జరిగిన సెమీస్-1లో ఇంగ్లాండ్‌పై 5 వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించి.. ఫైనల్ చేరుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 166 పరుగులు చేసింది. మొయిన్ అలీ 51*, డేవిడ్ మలాన్ 41 పరుగులతో రాణించారు.
167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఒక ఓవర్ మిగిలుండగానే ఇంగ్లండ్ పై విక్టరీ సాధించింది. కీవీస్ జట్టు 19 ఓవర్లలో 5 వికెట్లకు 167 పరుగులు చేసింది.ఓపెనర్ డరిల్ మిచెల్ 72* పరుగులతో చెలరేగగా.. డేవాన్ కాన్వే 46 పరుగులతో కీవీస్ విజయంలో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఈ విజయంతో 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఎదురైన పరాభావానికి బదులు తీర్చుకుంది కీవీస్ జట్టు.
Malala Yousafzai: వివాహబంధంలోకి మలాలా
IFFI Awards 2021: ఎక్కాడా తగ్గేదే లే అంటున్న సంమంత..
Tamil Nadu Rain: తమిళనాడు భారీ వర్షాలతో 12 మంది మృతి
RRR: రామ్ చరణ్, ఎన్టీఆర్ ‘నాటు’ డ్యాన్స్ అదిరింది!
Gold Prices: బంగారం కొనాలనుకునేవారికో గుడ్ న్యూస్..
Hindi: మాకు హిందీ తెలియదు.. సీఎస్‌ను మార్చండి !
వామ్మో.. టూత్ పేస్ట్ తో పిల్లలకు ఇంత డేంజరా?