దర్వాజ-హైదరాబాద్
YouTube channels: భారతదేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, ప్రజా శాంతికి సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్నఒకదానితో పాటు మొత్తం ఎనిమిది యూట్యూబ్ ఛానెళ్లను కేంద్ర సమాచార అండ్ ప్రసార మంత్రిత్వ శాఖ గురువారం బ్లాక్ చేసింది. IT రూల్స్-2021 ప్రకారం ఏడు భారతీయ, ఒక పాకిస్తాన్ ఆధారిత యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లను మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసింది. బ్లాక్ చేయబడిన YouTube channels కు114 కోట్ల మంది వీక్షణలు, 85,73,000 మంది subscribers ఉన్నారు. యూట్యూబ్‌లో బ్లాక్ చేయబడిన ఈ ఛానెళ్ల ద్వారా ఫేక్ యాంటీ ఇండియా కంటెంట్‌తో డబ్బు ఆర్జిస్తున్నట్లు వెల్లడైంది.
అంతకుముందు ఏప్రిల్ 25న, భారతదేశ జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, పబ్లిక్ ఆర్డర్‌కు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు 10 భారతీయ, 6 పాకిస్తాన్ ఆధారిత ఛానెళ్లు సహా 16 యూట్యూబ్ న్యూస్ ఛానెళ్లను కేంద్రం బ్లాక్ చేసింది.