పంజాబ్ లోని భటిండా ఆర్మీ క్యాంప్ పై కాల్పులు.. : నలుగురు సైనికులు మృతి

Encounter killing, Kulgam, Terrorism, Jammu Kashmir, Pulwama, ఎన్ కౌంటర్ , కుల్గాం, ఉగ్రవాదం, జమ్మూ కాశ్మీర్, పుల్వామా,

ద‌ర్వాజ‌-భ‌టిండా

Bathinda (Punjab) : పంజాబ్ లోని భ‌టిండా మిలిటరీ స్టేషన్ లో బుధ‌వారం తెల్లవారుజామున జరిగిన కాల్పుల్లో నలుగురు సైనికులు మరణించారు. జవాన్లు ఆర్మీకి చెందిన ఆర్టిలరీ విభాగానికి చెందినవారు. కాల్పుల నేప‌థ్యంలో ఆ ప్రాంతాన్ని మూసివేశామనీ, క్విక్ రెస్పాన్స్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయని ఆర్మీ సౌత్ వెస్ట్రన్ కమాండ్ తెలిపింది.

భ‌టిండా మిలటరీ స్టేషన్ లో తెల్లవారుజామున 04.35 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. దీంతో వెంట‌నే స్టేషన్ క్విక్ రియాక్షన్ టీమ్స్ యాక్టివేట్ అయింది. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి మూసివేశారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. నలుగురు సైనికులు మ‌ర‌ణించారు. మరిన్ని వివరాలు త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని భార‌త ఆర్మీ ఉన్న‌తాధికారులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.

ఈ ఘటనపై ఆర్మీ, పంజాబ్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నారని మరో ప్రకటనలో పేర్కొన్నారు. రెండు రోజుల క్రితం అదృశ్యమైన ఇన్సాస్ రైఫిల్, మందుగుండు సామగ్రిని ఈ ఘటనలో ఉపయోగించి ఉండొచ్చన్న వార్తలపై ఆర్మీ స్పందిస్తూ రెండు రోజుల క్రితం అదృశ్యమైన 28 రౌండ్లతో పాటు ఇన్సాస్ రైఫిల్ ప్రమేయంతో సహా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపింది.

అధికారుల మెస్ లోనే కాల్పులు జరిగినట్లు సమాచారం. భ‌టిండా మిలటరీ స్టేషన్ వెలుపల పోలీసు బృందం వేచి ఉందని, సైన్యం ఇంకా వారి ప్రవేశాన్ని క్లియర్ చేయలేదని భ‌టిండా సీనియర్ సూపరింటెండెంట్ జిఎస్ ఖురానా తెలిపారు.

Related Post