మ‌హింద్రా గ్రూప్ మాజీ చైర్మ‌న్ కేశుబ్ మహీంద్రా క‌న్నుమూత

Mahindra & Mahindra, Keshub Mahindra,

దర్వాజ-ముంబయి

Keshub Mahindra passes away: మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా గ్రూప్ గౌర‌వ చైర్మ‌న్, భార‌త‌దేశ‌పు అత్యంత వృద్ధ బిలియనీర్ కేశుబ్ మహీంద్రా క‌న్నుమూశారు. 99 సంవ‌త్స‌రాల ఆయ‌న దాదాపు 48 సంవత్సరాల పాటు మ‌హీంద్రా గ్రూప్ ఛైర్మన్‌గా కొన‌సాగి, కంపెనీ ఎదుగుద‌ల‌లో ఎంతో కృషి చేశారు.

ఫోర్బ్స్ జాబితా ప్ర‌కారం కేశుబ్ మహీంద్రా నికర విలువ 1.2 బిలియన్ డాలర్లు. మహీంద్రా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి 2012 ఆగస్టు 9న పదవీ విరమణ చేశారు. ఆ త‌ర్వాత ఆనంద్ మహీంద్రాకు కంపెనీ పగ్గాలు అప్పగించి, గౌర‌వ చైర్మ‌న్ గా కొన‌సాగుతున్నారు. దాదాపు 48 సంవత్సరాల పాటు మ‌హీంద్రా గ్రూప్ ఛైర్మన్‌గా కొన‌సాగిన ఆయ‌న‌.. మహీంద్రా గ్రూప్ ఆటోమొబైల్ తయారీదారు నుండి ఐటీ, రియల్ ఎస్టేట్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హాస్పిటాలిటీ వంటి ఇతర వ్యాపార విభాగాలకు విస్త‌రించ‌డంతో ఎంతో కృషి చేశారు.

కేశుబ్ మహీంద్రా క‌న్నుమూసిన‌ విషయాన్ని మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థల మాజీ ఎండీ పవన్ కె గోయెంకా తన ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. పారిశ్రామిక ప్రపంచం నేడు ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయింద‌నీ, కేశుబ్ మహీంద్రాకు సాటి ఎవరూ లేరంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.

Related Post