దర్వాజ-హైదరాబాద్
D Srinivas resigns from Congress: కాంగ్రెస్ లో చేరినది తన కుమారుడు ధర్మపురి సంజయ్ అని మాజీ ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ స్పష్టం చేశారు. తన కుమారుడితో కలిసి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్ కు వెళ్లినట్లు శ్రీనివాస్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తనకు పార్టీ కండువా కప్పి తాను కూడా కాంగ్రెస్ లో చేరానని కొందరు నేతలు చెప్పారన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో చేరానని భావిస్తే రాజీనామా చేస్తున్నానని తెలిపారు. తనను ఎలాంటి వివాదాల్లోకి లాగవద్దని, వయసు రీత్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని మాజీ మంత్రి స్పష్టం చేశారు.
అలాగే, డీ.శ్రీనివాస్ భార్య డీ విజయలక్ష్మీ ఆయనను రాజకీయాలకు వాడుకోవద్దని కాంగ్రెస్ కు విజ్ఞప్తి చేస్తూ ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. తనకు గతంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, నిన్నటి ఒత్తిడి కారణంగా నిన్న రాత్రి ఫిట్స్ బారిన పడ్డారని ఆమె పేర్కొన్నారు. మళ్లీ ఈ వైపు రావద్దని కాంగ్రెస్ నేతలను చేతులు జోడించి అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు.
కాంగ్రెస్కు షాకిచ్చిన డీఎస్..నిన్న జాయిన్ నేడు ఎగ్జిట్#Dsrinivas #Telanganacongress #oneindiatelugu pic.twitter.com/S64PdDSAXK
— oneindiatelugu (@oneindiatelugu) March 27, 2023