Loading Now
Fuel prices rise

మళ్లీ పెరిగిన పెట్రోల్ ధరలు

• లీటరు పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసల పెంపు
• చాలా ప్రాంతాల్లో లీటరు పెట్రోల్‌ ధర రూ.110కు పైనే..

ద‌ర్వాజ‌-న్యూఢల్లీ
Fuel prices rise: దేశంలో చమురు ధరలు ఇదివరకెప్పుడు లేని విధంగా చుక్కలనంటుతున్నాయి. గత వారం రోజులుగా వరుసగా పెరుగుతూ ఇంధన ధరలు వాహనదారుల నడ్డివిరుస్తున్నాయి. గురువారం కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మళ్లీ పెరిగాయి. దేశంలోని చాలా నగరాల్లో లీటరు పెట్రోల్‌పై 31 పైసల నుంచి 35 పైసలు పెరిగాయి. డీజిల్‌పై 34 పైసల నుంచి 37 పైసలు పెరిగింది. దీంతో దేశంలోని చాలా ప్రాంతాల్లో లీటరు పెట్రోల్‌ ధరలు రూ.110కి పెరిగింది. డీజిల్‌ ధరలు సైతం చాలా రాష్ట్రాల్లో సెంచరీ కొట్టాయి.

ప్రస్తుతం దేశరాజధాని ఢల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.104.79కు చేరగా, డీజిల్‌ ధర రూ.93.52కు పెరిగింది. ఆర్థిక రాజధాని ముంబయిలో లీటరు పెట్రోల్‌ ధర రూ.110.75కు, లీటరు డీజిల్‌ ధర రూ.101.40కు చేరింది. చమురు ధరల తాజా పెంపుతో చెన్నైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.102.10, డీజిల్‌ రూ.97.93, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.105.44, డీజిల్‌ రూ.96.63, బెంగళూరులో పెట్రోల్‌ రూ.108.44, డీజిల్‌ రూ.99.26కు చేరాయి.

తెలుగు రాష్ట్రాల్లోనూ లీటరు పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసల వరకు పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటరు పెట్రోల్‌ ధర రూ. 109కి చేరింది. లీట‌రు డీజిల్‌ రూ.102.04కు పెరిగింది. మొత్తంగా గత 20 రోజుల్లో 16 సార్లు చమురు ధరలు పెరగడం గమనార్హం.

జీమెయిల్ సేవ‌ల‌కు అంత‌రాయం

బాల్య వివాహాలు.. ఏటా 22 వేల మంది బాలిక‌లు బలి

2-18 వ‌య‌స్సుల వారికి క‌రోనా వ్యాక్సిన్‌

ఢిల్లీలో పాక్ ఉగ్ర‌వాది అరెస్ట్‌

ఈటల రాజేందర్‌పై కేసు నమోదు

క్లిష్ట పరిస్థితుల్లో.. విద్యుత్‌ సంక్షోభం.. : కేజ్రీవాల్‌

యూపీలో నిరంకుశ పాల‌న..

జమ్మూకాశ్మీర్‌లో ఎదురుకాల్పులు.. ఐదుగురు జవాన్లు మృతి

Share this content:

You May Have Missed