Loading Now
తెలంగాణ‌, హైద‌రాబాద్, గ‌ణ‌ప‌తి విగ్ర‌హాలు, జోగినిపల్లి సంతోష్ కుమార్, బీఆర్ఎస్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్, Telangana, Hyderabad, Ganapathy Statues, Joginapally Santosh Kumar, BRS, Green India Challenge,

చిన్నారుల‌కు విత్తన గణపతి ప్రతిమలను అందించిన ఎంపీ సంతోష్ కుమార్

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Hyderabad: సంకల్పం ఎంత గొప్పదైతే ప్రజల నుంచి అంత మంచి స్పందన లభిస్తుందని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు. మంగ‌ళ‌వారం కూకట్ పల్లిలోని కే.పీ.హెచ్.బీ ఫేజ్– 6 లోని నెక్సెస్ హైదారాబాద్ మాల్ లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ఆధ్వర్యంలో చిన్నారులకు ఆయ‌న “సీడ్ గణేష్ ప్రతిమలను” అందించారు.

ఈ సంద‌ర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ.. గణేష్ పండగ అంటే చిన్నరులకు అమితమైన ఇష్టమనీ, అలాంటి పండుగలో ఒక మంచి ఆశయాన్ని జతచేయాలనే ఆలోచనతో నాలుగు సంవత్సరాల క్రితం విత్తనాలను మిళితం చేసి గణేష్ ప్రతిమలను తయారు చేయించి భక్తులకు అందించామ‌ని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మానికి మంచి స్పందన రావడం.. చిన్నారులు, వారి తల్లిదండ్రులు సీడ్ గణేషుడి ప్రతిమలు కావాలని అడగడంతో ప్రతీసారి ప్రతిమలను పంపిణీ చేస్తూ వస్తున్నామ‌ని చెప్పారు. నేటి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ చిన్నారి ఎంతో సంతోషంతో గణేష్ ప్రతిమలను తీసుకోని మురిసిపోవడం చూస్తుంటే చాలా సంతోషం కలుగుతుందన్నారు.

కల్ముషం లేని చిన్నారుల మనసులో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” ద్వారా ఒక సామాజిక బాధ్యతను నేర్పుతున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు జోగినిపల్లి సంతోష్ కుమార్ అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న పుష్ప సినిమా చైల్డ్ ఆర్టిస్టు ద్రువన్ మాట్లాడుతూ.. ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంద‌నీ, త‌న‌కు వినయకచవితి పండగ అంటే చాలా ఇష్టమ‌నీ, ఈలాంటి పండగలో సీడ్ గణేషుడి ద్వారా భక్తి, ప్రకృతికి మేలు చేసేలా విత్తనాలను కలిపి అందించడం చాలా ఇన్సిపిరేషన్ కలిగించిందని చెప్పాడు. ప్రతీ ఒక్కరు సీడ్ గణేష్ ను ప్రతిష్టించాలనీ, ప్రతీ ఒక్కరు మొక్కలు నాటాలని కోరుకుంటున్నానని తెలిపాడు.

Share this content:

You May Have Missed