Loading Now
Hanuman Jayanti

హనుమాన్ జయంతి.. అలర్ట్ అయిన తెలంగాణ పోలీసులు !

దర్వాజ-హైదరాబాద్

Telangana police on alert for Hanuman Jayanti: గురువారం హనుమాన్ జయంతి ఉత్సవాల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీరామనవమి శోభాయాత్రల సందర్భంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కమిషనర్, ఎస్పీలతో ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. మతపరంగా సున్నితమైన జిల్లాల్లో ఊరేగింపులను నిశితంగా పర్యవేక్షించాలనీ, అవసరమైతే క్యాంపులను పర్యవేక్షించాలని డీఐజీ, ఆపై స్థాయి అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. హనుమాన్ జయంతి ఊరేగింపుల్లో సామూహిక సమావేశాలు ఉంటాయనీ, రంజాన్ మాసం కావడంతో మసీదుల్లో పెద్ద ఎత్తున గుమిగూడే అవకాశం ఉండ‌టంతో పోలీసులు శాంతి భ‌ద్ర‌త‌కు విఘాతం క‌ల‌గ‌కుండా ఉండేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

హైదరాబాద్ లో విశ్వహిందూ పరిషత్ – భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో ఉదయం 11.30 గంటలకు గౌలిగూడ రామమందిరం నుంచి పుత్లీబౌలి చౌరస్తా – ఆంధ్రాబ్యాంకు చౌరస్తా, కోఠి- సుల్తాన్ బజార్ చౌరస్తాలు- రాంకోఠి చౌరస్తా – కాచిగూడ చౌరస్తా – నారాయణగూడ వైఎంసీఏ – చిక్కడపల్లి చౌరస్తా – ఆర్టీసీ క్రాస్ రోడ్స్ – అశోక్ నగర్ – గాంధీ నగర్ – ప్రగా టూల్స్ రోడ్డు మీదుగా ర్యాలీ నిర్వహిస్తారు. ప్యారడైజ్ క్రాస్ రోడ్స్ – సీటీవో జంక్షన్ – లీ రాయల్ ప్యాలెస్ – ఇంపీరియల్ గార్డెన్ – మస్తాన్ కేఫ్ గుండా కొన‌సాగే యాత్రల‌తో రాత్రి 8 గంటలకు హనుమాన్ టెంపుల్ తాడ్ బండ్ వద్ద ముగుస్తుంది. సుమారు 5 వేల మంది ఈ ఊరేగింపులో పాల్గొంటార‌ని స‌మాచారం. దీంతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న ఊరేగింపులు కూడా ప్లాన్ చేశారు.

ఉమ్మడి జిల్లాలైన నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. భైంసా, ఆదిలాబాద్, బోధన్, కరీంనగర్ తదితర సున్నిత ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సహా అదనపు బలగాలను మోహరించనున్నారు. సోషల్ మీడియా కంటెంట్ ను పర్యవేక్షించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని, ఇబ్బంది కలిగించే వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

శ్రీరామనవమి సందర్భంగా గత వారం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో నివారణ చర్యలు చేపట్టినట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘హింసకు సంబంధించి ఏ గ్రూపు నుంచి నిర్దిష్టమైన సమాచారం లేదు. శ్రీరామనవమి సందర్భంగా ఇతర రాష్ట్రాల్లో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు, హింస కారణంగా భద్రతా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

https://darvaaja.com/telangana-bjp-chief-bandi-sanjay-remanded-for-14-days-transferred-to-khammam-jail/

Share this content:

You May Have Missed