Breaking
Sat. Jun 28th, 2025

Heavy rains: రాష్ట్రంలో మ‌రో రెండు రోజులు భారీ వ‌ర్షాలు: హైదరాబాద్ వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రిక‌లు

Cloudy sky, Hyderabad, IMD, Rainfall, Telangana, మేఘావృతమైన ఆకాశం, హైదరాబాద్, ఐఎండీ, వర్షపాతం, తెలంగాణ,Karnataka , క‌ర్ణాట‌క‌,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Heavy rains: ఇప్ప‌టికే తెలంగాణ‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. అయితే, ఈ నెల పదో తేదీ వరకు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, జనగాం, సిద్దిపేట, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చ‌రించింది. ఈ క్ర‌మంలోనే ఇప్ప‌టికే అనేక చోట్ల వాన‌లు కురుస్తున్నాయి.

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడి సముద్ర మట్టానికి 5.8 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నట్లు సంబంధిత వ‌ర్గాలు పేర్కొన్నాయి. ద్రోణి ప్రభావంతో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించారు. ఇదిలావుండగా, బుధవారం కర్ణాటకలోని ప‌లు ప్రాంతాల్లో మరో ఉపరితల ద్రోణి ఏర్పడి సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో గ్రేటర్ హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం నుంచి వర్షం కురిసింది. బెంగ‌ళూరు న‌గ‌రంలో ఇప్ప‌టికే కురిసిన వాన‌ల‌తో వ‌ర‌ద‌నీట మునిగింది.

Related Post