Breaking
Tue. Nov 18th, 2025

హాకీ ఇండియా అధ్యక్షుడిగా భారత మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ ఎన్నిక

Hockey India, Dilip Tirkey, Hockey India president, Bhola Nath , Hockey India elections, హాకీ ఇండియా, దిలీప్ టిర్కీ, హాకీ ఇండియా అధ్యక్షుడు, భోలా నాథ్ , హాకీ ఇండియా ఎన్నికలు,

దర్వాజ-న్యూఢిల్లీ

Hockey India elections: హాకీ ఇండియా అధ్యక్ష పదవి రేస్ లో ముందంజలో ఉన్న భారత మాజీ కెప్టెన్ దిలీప్ టిర్కీ శుక్రవారం అత్యున్నత పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అక్టోబరు 1న హాకీ ఇండియా ఎన్నికలు జరగాల్సి ఉండగా, ఏ పోస్టులకు పోటీదారులు లేకపోవడంతో ముందుగానే ఫలితాలు ప్రకటించడం వల్ల సమాఖ్య నిబంధ‌న‌ల‌ ప్రకారం ప్రస్తుత అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి మార్గం సుగమం చేశారు.

ఉత్తరప్రదేశ్‌ హాకీ చీఫ్‌ రాకేష్‌ కత్యాల్‌, హాకీ జార్ఖండ్‌కు చెందిన భోలానాథ్‌ సింగ్‌లు శుక్రవారం తమ నామినేషన్‌లను ఉపసంహరించుకోవడంతో టిర్కీ ఎన్నికయ్యారు. సెక్రటరీ జనరల్‌గా భోలా నాథ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (FIH) టిర్కీ, తాజాగా ఎన్నికైన స‌భ్యుల నియామకాలను ఆమోదించింది. ఒక లేఖలో FIH.. ఏదైనా పోస్ట్ కోసం పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య పోస్టుల సంఖ్యకు సమానంగా లేదా అంతకంటే తక్కువగా ఉంటే, వారు హాకీ ఇండియా వెబ్‌సైట్‌లోని ఎన్నికల ఉప-చట్టాల ప్రకారం ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు పరిగణించబడతారు అని తెలిపింది. “కాబట్టి, హాకీ ఇండియా వెబ్‌సైట్‌లో ఉంచిన విధంగా హాకీ ఇండియా ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఎన్నికైనందుకు మేము సంతోషిస్తున్నాము.. పోస్ట్‌ల ఎన్నిక అన్ని పోస్టులకు ఏకగ్రీవంగా జరిగింది” అని అది పేర్కొంది.

ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు జస్టిస్ అనిల్ ఆర్ దవే, ఎస్‌వై ఖురైషీ, జాఫర్ ఇక్బాల్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్స్ (COA) ప్రయత్నాలను హాకీ పాలకమండలి ప్రశంసించింది. “ఎన్నికల ప్రక్రియ పూర్తయి, ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినందుకు మేము సంతోషిస్తున్నాము. డాక్టర్ దిలీప్ టిర్కీ, భోలా నాథ్ సింగ్, శేఖర్ జె మనోహరన్‌లకు మా అభినందనలు తెలియజేస్తున్నాము.. వారితో సన్నిహితంగా పనిచేయడానికి ఎదురుచూస్తున్నాము” అని క‌మిటీ పేర్కొంది.

సీఓఏ, ఎఫ్‌ఐహెచ్‌లకు కృతజ్ఞతలు తెలుపుతూ టిర్కీ ట్విట్టర్‌లో.. భారత హాకీని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని చెప్పారు. ‘భారత హాకీ కొత్త శిఖరాలకు చేరుకునేలా చూస్తాను’ అని ట్వీట్ చేశాడు.

టిర్కీ వంటి గొప్ప ఆటగాడు హాకీ ఇండియా పాలనను చేపట్టేందుకు వీలుగా అధ్యక్ష పదవికి తన నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించుకున్నట్లు భోళానాథ్ తెలిపారు. “దిలీప్ టిర్కీతో సరైన సంప్రదింపుల తర్వాత నేను ఉపసంహరించుకున్నాను. అతను ఒక లెజెండ్, మేము భారత హాకీకి మేలు చేయడానికి సంయుక్తంగా పని చేయాలని నిర్ణయించుకున్నాము. భారత్ మళ్లీ ఒలింపిక్ స్వర్ణం గెలవడమే మా లక్ష్యం” అని భోలా నాథ్ చెప్పిన‌ట్టు పీటీఐ నివేదించింది.

Related Post