Breaking
Tue. Nov 18th, 2025

Amit Shah: ఇటాలియన్‌ కళ్లద్దాలు తీసి చూడు.. రాహుల్‌ గాంధీపై అమిత్‌ షా విమర్శలు

Home Minister Amit Shah slams Rahul Gandhi

దర్వాజ-న్యూఢిల్లీ

Amit Shah slams Rahul Gandhi: కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఇటాలియన్ క‌ళ్ల‌ద్దాలు తీసి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ చేస్తున్న అభివృద్ధి పనులను చూడాలంటూ రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు. అరుణాచల్‌ప్రదేశ్‌లోని నంసాయి జిల్లాలో రూ.1000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభించిన సంద‌ర్భంగా అమిత్ షా మాట్లాడుతూ పై వ్యాఖ్య‌లు చేశారు.

బీజేపీ స‌ర్కారు దేశంలో మెరుగైన పాల‌న అందిస్తుంటే.. ఎనిమిదేళ్లలో ఏం జరిగిందని కాంగ్రెస్ నేతలు ప్ర‌శ్నిస్తున్నార‌నీ.. దేశంలో జ‌రిగిన అభివృద్ధిని చూడ‌టానికి రాహుల్ గాంధీ తప్పనిసరిగా ఇటాలియన్ కళ్లద్దాలు తీయాలంటూ విమ‌ర్శించారు. అరుణాచల్‌లో గత ఎనిమిదేళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, శాంతిభద్రతలను బలోపేతం చేయడానికి మరియు పర్యాటక రంగాన్ని పెంచడానికి చాలా పనులు జరిగాయ‌ని తెలిపారు.

అంతకు ముందు బీజేపీ పై రాహుల్ గాంధీ ధరల పెరుగుదల విషయాలను ప్రస్తావిస్తూ విమర్శలు గుప్పించారు.

Related Post