Loading Now
home remedies to bring back shine and glow in skin

కోమ‌ల‌మైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!

నేటి కాలంలో చాలా మంది యువతీ యువకులు నలుగురిలో అందంగా కనిపించాలి.. అందర్లోనూ నేనే మెరిసిపోవాలంటూ.. అందరి కళ్లు నా సౌందర్యం పైనే ఉండాలంటూ భావిస్తుంటారు. అందుకే ముఖాన్ని అందంగా.. అద్దం మెరిసిపోయినట్టు మెరిసిపోవాలంటూ రకరకాల ఎక్సపర్ మెంట్లు చేసేస్తుంటారు. వారి ముఖ సౌందర్యం చూసి అందరూ ఫిదా అవ్వాలని ఏవేవో క్రిములు గట్రా వాడుతూ.. అందంగా ఉండే ముఖాన్ని కాస్త అందవిహీనంగా చేసేస్తుంటారు.

ఎన్నో రకాల క్రిములను వాడటం మూలంగా చాలా మంది సైడ్ ఎఫెక్ట్స్ తో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అందుకే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ భారిన పడకుండా.. మెరిసిపోవాలనుకునే యువత కొన్ని రకాల హోమ్ టిప్స్ తో ఈజీగా మెరిసిపోవచ్చు.

83 కోమ‌ల‌మైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!

మరి ఈ టిప్స్ ను ఎలా పాటించాలో మీరు కూడా ఓ లుక్కేయండి.. ముందే మన దేశంలో ఎండలు మండిపోతూ ఉంటాయి. అందుకే మీరు గనుక ఈ టిప్స్ ను క్రమం తప్పకుండా పాటిస్తే మెరిసే అందం మీ సొంతం అవుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే పండుగలు వచ్చినా.. వేడుకలు వచ్చినా.. అంతా మీ ముఖ సౌందర్యం గురించే మాట్లాడుకుంటారు.. ఏ క్రీము వాడుతుందని మీ గురించే గుసగుసలాడుతుంటారు.

87 కోమ‌ల‌మైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!

అందుకు మీరు ముందుగా అర టీస్పూన్ పసుపును తీసుకుని అందులో నాలుగు టీ స్పూన్ల పాలు కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిసి ముఖంపైన, మెడ చుట్టూ పట్టించాలి. ఈ మిశ్రమాన్ని 20 నిమిషాల పాటు ఉండనిచ్చి ఆ తర్వాత గోరు వెచ్చని లేదా చల్లని నీళ్లతో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు లేదా మూడు సార్లు చేస్తే మీ చర్మం దగదగా మెరిసిపోతుంది.

అలాగే రెండు మూడు క్యారెట్లను తీసుకుని వాటిని పేస్ట్ గా చేసుకోవాలి. అందులో కూసింత తేనే, పుల్లటి పెరుగును వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ విధంగా వారానికి ఒక సారి గనక చేస్తే మీ ముఖం మృదువుగా మారి మెరుస్తుంది. వీటితో పాటుగా ఒక చాయ చెంచా నిమ్మరసాన్ని తీసుకుని అందులో ఒక చాయ చెంచా షుగర్ ను మిక్స్ చేసుకోవాలి.

84 కోమ‌ల‌మైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!

దాన్ని ముఖంగా పై రుద్ది.. మెళ్లిగా చక్కెర కరిగేదాకా మసాజ్ చేసుకోవాలి. ఆ తర్వాత ముఖాన్ని చల్లటి నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మీ ముఖ చర్మం స్మూత్ గా మారి మెరిసిపోతుంది.అలాగే ఒక టేబుల్ స్పూన్ బొప్పాయి జ్యూస్ ను తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల దోసకాయ జ్యూస్ ను, అరటి పండులోని సగభాగాన్ని తీసుకుని దాన్ని జ్యూస్ లా చేసి.. ఈ మూడింటిని మిక్స్ చేసుకోవాలి.

85 కోమ‌ల‌మైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!

ఈపేస్టును ముఖానికి అరగంట పాటు పట్టించాలి. ఆతర్వాత కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా రోజ్ వాటర్ కూడా మీ ముఖాన్ని మెరిసిపోయేలా చేస్తుంది. అరగంట పాటు రోజ్ వాటర్ ను ఫ్రిజ్ లో ఉండనివ్వాలి. ఆ తర్వాత దాన్ని తీసుకుని దూదిని రోజ్ వాటర్ లో ముంచి ముఖానికి మసాజ్ చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం వేళ్లల్లో మీరు గనుక ఇలా చేస్తే మెరిసే అందం మీ సొంతం అవుతుంది. ఈ టిప్స్ ను పాటించి.. అందానికి అందం.. ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.

90 కోమ‌ల‌మైన నిగారింపు కోసం ఈ చిట్కాలు పాటించండి!

వాట్సాప్ లో ఇక మెసేజ్ చేయలేరు !

మేడారం జాతర‌కు వేళాయ‌రా..!

క‌డుపునొప్పి, విరోచ‌నాలు అయితే వెంటనే జాగ్ర‌త్త ప‌డాల్సిందే..!

షుగ‌ర్ తో జ‌ర పైలం!

Share this content:

You May Have Missed