Loading Now
Huzurabad By-election

అక్టోబ‌ర్ 30న హుజూరాబాద్ ఉప ఎన్నిక

• షెడ్యూల్ విడుద‌ల చేసిన ఈసీ

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్
హుజూరాబాద్ ఉప ఎన్నిక‌కు షెడ్యూల్ విడుద‌లైంది. అక్టోబ‌ర్ 1న నోటిఫికేష‌న్ విడుద‌ల, అదే నెల 30న పోలింగ్ నిర్వ‌హించ‌నున్నామ‌ని ఈసీ వెల్లడించింది. నామినేష‌న్ దాఖ‌లుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 8, కాగా 11వ తేదీన నామినేష‌న్ల‌ను ప‌రిశీలించ‌నున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 13. ఇక ఫ‌లితాల‌ను న‌వంబ‌ర్ 2న వెల్ల‌డించ‌నున్నారు.

కాగా, ఈట‌ల రాజేంద‌ర్ త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి జూన్ 12న రాజీనామా చేశారు. దీంతో హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో టీఆర్ఎస్ పార్టీ త‌ర‌పున విద్యార్థి నాయ‌కుడు గెల్లు శ్రీనివాస్ యాద‌వ్, బీజేపీ అభ్య‌ర్థిగా ఈట‌ల రాజేంద‌ర్ బ‌రిలో నిలిచారు. కాంగ్రెస్ ఇంకా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌లేదు. హుజూరాబాద్ ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో ఒక్కసారిగా రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ప్రచారంతో హోరెత్తించడానికి అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.

కుండ‌పోత వ‌ర్షం.. నీట‌మునిగిన హైద‌రాబాద్

భార‌త్ బంద్

పెగాస‌స్ తో నిఘా పెట్టారు: కేంద్రంపై మ‌మ‌త ఫైర్

బాలిక‌పై 30 మంది లైంగిక‌దాడి

ఎమ్మెల్యే సీతక్కకు అస్వస్థత

పంజా విసురుతున్న డెంగ్యూ

Share this content:

You May Have Missed