Breaking
Tue. Nov 18th, 2025

ప్రగతి భవన్‌ ముట్టడికి ఏబీవీపీ కార్యకర్తల య‌త్నం.. పోలీసుల అరెస్టులు

Hyderabad, ABVP workers, Pragathi Bhavan, arrest, Police , హైద‌రాబాద్, ఏబీవీపీ కార్య‌క‌ర్త‌లు, పోలీసులు, ప్ర‌గ‌తి భ‌వ‌న్, అరెస్టులు,

ద‌ర్వాజ‌-హైద‌రాబాద్

Hyderabad: శుక్రవారం ప్రగతి భవన్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏపీవ‌పీ)కు చెందిన 20 మంది కార్యకర్తలను పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఇంజినీరింగ్ ఫీజుల పెంపునకు నిరసనగా ఆందోళనలు చేస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు ప్రగతి భవన్‌ ముందు దిగి నినాదాలు చేస్తూ ప్రగతి భవన్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

ఏబీవీపీ కార్యకర్త‌ల‌ను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలోకి రాకుండా పోలీసులు బయట నిలబెట్టి అడ్డుకున్నారు. వారందరినీ పోలీసు వాహనంలో ఎక్కించి గోషామహల్ పోలీస్ స్టేడియానికి తరలించారు. అక్కడ వారిని ప్రివెంటివ్ కస్టడీలో భాగంగా ఉంచారు.

అంతకుముందు రోజు, తెలంగాణ రాష్ట్రంలో ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల ఫీజులను పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ABVP గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో వివిధ స్థలాలలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.

Related Post